YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం వింతలు తెలంగాణ

తెలంగాణ పంట పొలాల్లో ముమైత్ ఖాన్ దిష్టిబొమ్మ

తెలంగాణ పంట పొలాల్లో ముమైత్ ఖాన్ దిష్టిబొమ్మ

తెలంగాణ పంట పొలాల్లో ముమైత్ ఖాన్ దిష్టిబొమ్మ
హైద్రాబాద్, నవంబర్ 16, 
నటి, ఐటమ్ డ్యాన్సర్ ముమైత్ ఖాన్.. సినీ ప్రేక్షుకులనే కాదు, తెలంగాణ రైతుల్లో కూడా సంతోషాన్ని నింపుతోంది. పొలాల్లో పక్షులను తరుముతూ.. పంటలను కాపాడుతోంది. అదేంటీ?.. ఆమె సినిమాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటుందా అని ఆశ్చర్యపోవద్దు. ఇదంతా చేస్తున్నది ఆమె ‘పోస్టర్’. ఔను, నిజం!కరీంనగర్‌లోని ఓ రైతు తన పంటను కాపాడుకోడానికి ముమైత్ ఖాన్‌ను రంగంలోకి దించాడు. సెక్సీ చూపులతో చంపేసే ఆమె పోస్టర్‌ను పొలం మధ్యలో ఏర్పాటు చేశాడు. ఆ పోస్టర్‌ను చూడగానే పక్షుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో పంటను నాశనం చేయకుండానే తిరిగి వెళ్లిపోతున్నాయి.ఆ రైతు కేవలం పోస్టర్ పెట్టి చేతులు దులుపుకోలేదు. ముమైత్ ఖాన్ నటించిన సినిమాల్లో.. మాంచి ఊపిచ్చే పాటలను కూడా పెడుతున్నాడు. దీంతో ఆ పరిసరాల్లో ఒక్క పక్షి కూడా ఉండటం లేదు. ఈ ఐడియా బాగా పనిచేయడంతో మిగతా రైతులు కూడా తమ పొలాల్లో ముమైత్ ఖాన్ పోస్టర్లు పెట్టాలని నిర్ణయించుకున్నారు. మరి, ఈ విషయం ముమైత్ ఖాన్‌ను తెలిసిందో లేదో. పొలాల్లో హీరోయిన్ల ఫొటోలు పెట్టే ట్రెండ్.. మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ నుంచి మొదలైంది. కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన చెన్నారెడ్డి అనే రైతు తన పంటకు దారిని పోయేవాళ్ల దిష్టి తగలకుండా ఉండానికి సన్నీ లియోన్ పోస్టర్లను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా కొండారెడ్డి మండలం గొల్లపల్లికి చెందిన అన్వర్‌(30) పంటకు దిష్టి తగులుతుందని భావించి తనకెంతో ఇష్టమైన కాజల్ అగర్వాల్ కటౌట్‌‌లను పొలంలో ఏర్పాటు చేశారు. దీంతో ఆ దారినపోయేవారి దృష్టంతా ఆ పోస్టర్లపైనే ఉంటుందట. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో దిష్టి గుమ్మిడి కాయలకు బదులు హీరోయిన్ల పొటోలను గుమ్మాలను తగిలించినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

Related Posts