YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆస్తి-పాస్తులు తెలంగాణ

 నేను లంచం తీసుకోను= వైరల్ గా మారిన ఫ్లెక్సీ

 నేను లంచం తీసుకోను= వైరల్ గా మారిన ఫ్లెక్సీ

 నేను లంచం తీసుకోను= వైరల్ గా మారిన ఫ్లెక్సీ
కరీంనగర్, నవంబర్ 18, 
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇస్తే కానీ ఏ పని జరగడంలేదు. కొందరు లంచాలు తీసుకున్నా పనిచేస్తారనే నమ్మకం కూడా ఉండదు. లంచాలు మింగి మమ్మల్ని అన్యాయం చేస్తూ ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారంటూ నాలుగు రోజుల కిందట గద్వాల జిల్లాలో రైతులు తమ గోడును కలెక్టర్‌ను వెళ్లబోసుకున్న ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ కార్యాలయాల్లో నిజాయతీగా పనిచేస్తే వ్యవస్థలో అవినీతే ఉండదని ఓ అధికారి పేర్కొన్నారు. అంతేకాదు, తాను లంచం తీసుకోను అని పెద్ద అక్షరాలతో తన ఆఫీసులో బోర్డు పెట్టించుకున్నారు.కరీంనగర్ ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీసులో కమర్షియల్ ఏడీఈగా పనిచేస్తున్న పోడేటి అశోక్ ‘నేను లంచం తీసుకోను’ అంటూ పెద్ద అక్షరాలతో తన కార్యాలయంలో బోర్డు రాయించి పెట్టడం చర్చనీయాంశమైంది. తాను లంచం తీసుకోనని తన కార్యాలయంలో బోర్డు పెట్టించారు. అందరూ నిజాయతీగా పనిచేస్తే అవినీతి రహిత వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.మరోవైపు, తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు భూ వివాదం, లంచం అనే ప్రచారం కూడా సాగుతోంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ లావణ్య నివాసంలో నాలుగు నెలల కిందట ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె నివాసంలో రూ. 93లక్షల నగదు, 40తులాలకు పైగా బంగారం గుర్తించారు.

Related Posts