YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆందోళనలో చీనీ రైతులు

ఆందోళనలో చీనీ రైతులు

ఆందోళనలో చీనీ రైతులు
అనంతపురం, 
చీనీ పంటకు గార్ల దిన్నె పెట్టింది పేరు. రైతులు పండించే చీనీ కాయలు అంతర్జాతీయ మార్కెట్‌కు తరలివెళ్లేవి. ఆ గ్రామం పేరును చెబితే చాలు వ్యాపారులు నమ్మకంతో ఆ చీనీకాయలను కొనుగోలు చేసేవారు. ధరలు తక్కువ ఉన్న సమయంలో పంట బాగాపండేది. ఉన్న ధరల్లోనే ఆ గ్రామ రైతులకు బంగారు పంట పండేది. ధర ఎక్కువ ఉన్న సమయంలో ఆ రైతుకు చీనీ పంట కాసులు కురిపించేది. అలాంటి గ్రామ రైతన్న  కుదేలవుతున్నాడు. వరుస కరువులతో భూగర్భజలాలు అడుగంటాయి. సాగునీరు విడుదలలో కూడా తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో నీటి కొరతతో చీనీ తోటలను కాపాడలేక గ్రామ రైతన్న నేడు దినకూలీగా మారాడు. జిల్లాలోని గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలోని నేటి రైతు దీనస్థితి కరువుకు అద్దంపడుతోంది.పిఎబిఆర్‌ ద్వారా పొడిచెరువు నుంచి కోటంక చెరువును నింపి రైతులను ఆదుకుందామని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.30 లక్షలు వెచ్చించింది. పొడిచెరువు నుంచి కాల్వను తవ్వించి దాదాపు 7 సంవత్సరాలు పూర్తయినా ఇంత వరకు ఆ చెరువుకు నీటిని తీసుకురావటంతో అప్పటి కాంగ్రెస్‌, ఇప్పటి టిడిపి ప్రభుత్వాలు పూర్తీగా విఫలమయ్యాయి. పిఎబిఆర్‌ ద్వారా కోటంక చెరువుకు నీటిని అందిస్తే గతంలోలాగా రైతాంగం పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాకు ఎన్నడూ లేని విధంగా టిబి డ్యామ్‌ నుంచి 25 టిఎంసిల నీరు, హంద్రీనీవా నుంచి 45 టిఎంసిల నీరు అనంతకు వచ్చినా రైతుకు నీరు అందించి ఆదుకోవాలన్న ఆలోచన స్థానిక ఎమ్మెల్యే యామినీబాలకు, అధికారంలో ఉన్న టిడిపి నాయకులకు పట్టకపోవడం దారుణం.గార్లదిన్నె మండల పరిధిలోని కోటంక గ్రామం ఒకప్పుడు ప్రతి రైతు చీనీ చెట్ల ద్వారా లబ్ధిపొంది పది మందికి ఉపాధి కల్పించేవాడు. నాటి రైతులు నేడు దినకూలీలుగా మారారు. పది సంవత్సరాలుగా వరుస కరువుతో భూగర్భజలాలు అడుగంటాయి. బోరుబావుల్లో చుక్కనీరు కూడా రాకపోవటంతో సంవత్సరాల తరబడి కంటికిరెప్పలుగా పెంచిన చీనీ చెట్లు కల్లేదుటే ఎండిపోతున్నాయి. రైతులు ఏమీ చేయలేని నిస్సాహాయ స్థితిలో ఉన్నాడు. చీనీ చెట్ల సంరక్షణకు చేసిన అప్పులు తీర్చలేక కన్నతల్లిలాంటి భూములను అమ్ముకుని జానడంత పొట్టను పోషించుకోవటానికి దినసరి కూలీలుగా మారారు. పనిలేక కుటుంబ పోషణ భారమై గ్రామంలో సుమారు 500 నుంచి 600 కుటుంబాలు ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. దీన్ని బట్టి కరువు ఈ గ్రామాన్ని ఎంతగా కాటేసిందే అర్థం చేసుకోవచ్చు. ఇదే గ్రామంలో 80 మంది రైతులకు సగటున ఒక్కొక్క రైతుకు 600ల వరకు చీనీ చెట్లు ఉండేవి. అంటే కోటంక గ్రామంలో 48,000పైనే చీనీ చెట్లు ఉండేవి. పది సంవత్సరాల వరుస కరువుతో ఒక్కొక్క రైతు 20 నుంచి 30 బోరు బావులు తవ్విన చుక్కనీరు పడలేదు. దీంతో చేసేదేమీ లేక కంటికిరెప్పలా పెట్టుకున్న చీనీ చెట్లను నరికివేశారు. 12 సంవత్సరాల క్రితం వంద అడుగులు బోరుబావులు వేస్తే చాలు నీరు సంవృద్ధిగా పడేది. ఇప్పుడు 600 నుంచి 1000 అడుగుల వరకు బోరు వేసినా చుక్కనీరు పడక గ్రామాలు ఎండువారుతున్నాయి. ఒకప్పుడు చీనీ చెట్లతో కళకళలాడిన భూములు నేడు ఎండిపోయి పొడినేలలుగా దర్శనమిస్తున్నాయి. 

Related Posts