YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ దేశీయం

వెనక్కి వెళ్లిపోయిన ఆవాస్ నిధులు

వెనక్కి వెళ్లిపోయిన ఆవాస్ నిధులు

వెనక్కి వెళ్లిపోయిన ఆవాస్ నిధులు
హైద్రాబాద్, నవంబర్ 18,
కేంద్ర ప్రభుత్వం నిధులను నిలిపివేయనున్నది. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలకు ఇక నుంచి చిల్లిగవ్వ కూడా కేటాయించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ లిఖితపూ  పలుమార్లు లేఖ రాసింది.దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించ  నిధులను నిలిపివేయడంతో పాటు విడుదల చేసిన నిధులను కూడా వెనక్కు తీసుకోనున్నది. ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించలేదని తెలిసింది. ఈ నిధులను ఎందుకు వినియోగించుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ కోరింది. కానీ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవ డంతో విడుదల చేసిన నిధులను వెనక్కు తీసుకునేందుకు ప్రక్రియను కేంద్రం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పథకాలను ఎక్కువగా అమలు చేస్తున్నది.వీటిలో ప్రధానంగా ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన , ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, బేటీ బచావ్ బేటీ పడావ్ వంటి పథకాలను అమలు చేస్తున్నది. వీటిలో ఉపాధిహామీ పథకం తప్ప మిగతా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసినప్పటికీ వాటిని వినియోగించకుండా వృధా చేసినట్లు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలిసింది.  ఆవాస్ యోజన కింద 2016 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో 70, 674 ఇళ్ల నిర్మాణం కోసం రూ.190.78 కోట్లను కేటాయించింది. కేంద్రం ఇచ్చిన నిధుల్లో తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రెండేళ్లు గడిచినా నిధులను వినియగించుకోకుండా వృధా చేసింది.  దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 50లక్షల ఇళ్లు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి విడత నిధులను వృధా చేయడంతో పాటు రెండో విడత ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేదు. పైగా నిధులు మంజూరు చేయాలని  కూడా కోరలేదు. దీంతో కేంద్రప్రభుత్వం ఆవాస్ యోజనకు విడుదల చేసిన నిధులను వెనక్కు తీసుకోని ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని యోచిస్తున్నది.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం చేపట్టిన పీఎంజీఎస్‌వై పథకం పరిస్థితి కూడా ఇదే విధంగా ఉన్నట్లు తెలిసింది. గతేడాది పీఎంజీఎస్‌వై కింద కేంద్ర ప్రభుత్వం రూ.270 కోట్లు రాష్ట్రానికి కేటాయించింది. కానీ వీటికి సంబంధించిన వినియోగ పత్రాలు ఇప్పటి వరకూ సమర్పించలేదు.పైగా ఈ నిధులకు సంబంధించి చేపట్టిన పనులను కూడా గ్రామీణాభివృద్ది వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదు. పైగా ఈ అంశంపై రాష్ట్ర అధికారులను కేంద్ర ప్రభుత్వం వివరణ కోరగా స్పందించడం లేదని తెలిసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరా నికి పీఎంజీఎస్‌వై కింద నిధులను విడుదల చేయరాదని ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ కోటాను ఇతర రాష్ట్రాలకు కేటాయించేందుకు నిర్ణయించింది.ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం కింద వాటర్‌షెడ్ కార్యక్రమాలను అయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నది. మన రాష్ట్రంలోనూ వాటర్‌షెడ్ పథకాలకు సంబంధించి గతేడాది రూ. 170 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కానీ వాటర్‌షెడ్ పథకాలను చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. పైగా ఈ నిధులపై ఇప్పటి వరకూ కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించలేదని తెలిసింది. దీంతో ఈ నిధులను కూడా వెనక్కు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా బాలికల విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్రం లో అమలు చేస్తున్నది. పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలను వినియోగించినట్లు తెలిసింది. దీంట్లోనే అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం అందించేందుకు నిధులను కేంద్రప్రభుత్వం ఇస్తున్నది. కానీ పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించకుండా నిధులను వృధా చేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులను నిలిపివేయాలని యోచి స్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణను మార్చనున్నట్లు బీరాలు పలికారు. కానీ సంక్షేమ పథకాలను అమలు చేయకుండా, నిధులను కూడా ఖర్చు చేయకుండా వృధా చేయడం గమనర్హం.

Related Posts