YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

యదేఛ్చగా పార్కింగ్ స్థలాల ఆక్రమణలు

యదేఛ్చగా పార్కింగ్ స్థలాల ఆక్రమణలు

యదేఛ్చగా పార్కింగ్ స్థలాల ఆక్రమణలు
హైద్రాబాద్, నవంబర్ 17,
హైదరాబాద్ మహనగరంలో రోజురోజు కు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యతొ రోడ్లన్ని కిక్కిరిసి పొతుంటే , అసలే గుంతలు , అతుకులతో అంతంత మాత్రంగా ఉన్న రహదారులలో ఉన్న  కొద్దిపాటి స్దలంఅక్రమ పార్కింగ్‌లతొ ఆక్రమణలకు గురి అవుతున్నది.రొడ్డుపైన ఆటోలు,తొపుడు బళ్లతో నిండుతున్నాయి.నడవడానికి పుట్‌పాత్ లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఉన్న కొద్దిపాటి స్ధలాన్ని కూడ చిరు వ్యాపారులు ,ఆటొవాళ్ల తోఅక్రమణలకు గురి అవుతున్నది.రొడ్డు పైన వాహనాలు పార్క్ చేయడం వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.  పాటు వాహనదారులకు ప్రమాదాలకు గురి ఆవుతున్నారు.షాపింగ్ మాల్స్ లోసైతం పార్కింగ్ స్దలం లేకపోవడం సమస్యగా ఉన్నది.రోడ్డుపైన నడవడానికి మహిళలు,పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.నగరంలోని మెహిదిపట్నం,లో ప్రధాన రహదారి పైన , బస్టాండ్ పరిసరాలలో ఎటు చూసిన ఆటొలతో, చిరు వ్యాపారుల తోపుడు బండ్లతో నిండియున్నిది.ఆటోవాలాలు యధెచ్చగా బస్టాండ్ పరిసరాలనే ఆక్రమించి ఆటోలు నిలిపియుంచడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకుగురిఅవుతున్నారు.షాపులు ముందు  పార్కింగ్ స్దలం లేక పోవడంతో పుట్‌పాత్‌లపైన వాహనాలు నిలిపియుంచుతున్నారు.దీంతో పుట్‌పాత్‌లపై నడిచేవారు రోడ్డుపైన నడిచి ప్రమాదాల బారిన పడుతున్నారు. లంగర్‌హౌజ్‌లోని సురభి హోటల్ ముందు రొడ్డును సైతం ఆక్రమించి ,యాజమాన్యం టీ స్టాల్ ఎర్పాటు చేయడం  పార్కింగ్ స్ధలం లేక వాహనాలు రోడ్డుపైన పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెతుతున్నాయి..నానల్ నగర్,    టోలిచౌకి పరిసర ప్రాంత రెస్టారెంట్ లైన షాగ్ హజ్ మెదలైన చోట్ల రోడ్డు సగం వరకు వాహనాలతో ండియుంటున్నది.హైవే కావడం నిత్యం సాప్ట్‌వేర్ ఉద్యోగులకు ప్రదాన రహదారి కావడంతో రద్దీ ఎక్కువగా ఉండి ట్రాఫిక్ సమస్య లు తలెత్తున్నాయి. పక్కనే ట్రాఫిక్ పోలిసు స్టెషన్ ఉన్నప్పటికి పట్టించుకోక పోవడం శోచనీయం. గుడిమల్కాపూర్ , కార్వన్, జియాగూడ లతో పాటు దాదాపు నగరంలో ఆన్ని చోట్ల ప్రదాన సమస్యగడా మారింది.వాహన కాగితాలు సరిగా లేవనో, ట్రాఫిక్ నియమాలు ఉల్లంగించారనో  నిత్యం చలానాలు విధించే ట్రాఫిక్ పోలిసులు నిత్యం రోడ్ల పైన కెమెరాలతో కనిపించే వారుచలానాలపై ఉన్న శ్రద్ద అక్రమ పార్కింగ్ లు కనపడటం లేదా లేక షాపు యాజమానుల యిచ్చె మాముల్లతో సరిపెట్టుకొని సమస్యను పరిష్కరించుట లేదా అని ప్రజలు  వాపోతున్నారు. వెంటనే అక్రమ పార్కింగ్‌లు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు

Related Posts