YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి తెలంగాణ

ఉద్యోగం పోతుందని ఆత్మహత్య

ఉద్యోగం పోతుందని ఆత్మహత్య

ఉద్యోగం పోతుందని ఆత్మహత్య
హైద్రాబాద్, నవంబర్ 20  
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం కోల్పోతానని మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన పొగాకు రామలింగం కుమార్తె కుమారి హరిణి (24) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో నగరానికి వచ్చింది. రెండున్నరేళ్లుగా మాదాపూర్‌లోని గోల్డెన్ హిల్స్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది.హరిణి పని చేస్తున్న సంస్థ ఒప్పందం ప్రకారం డిసెంబర్ నెలతో ఉద్యోగం గడువు ముగుస్తోంది. దీంతో ఆమెతో పాటు మరికొంత మందికి ఆ కంపెనీ నోటీసులు జారీ చేసింది. ఉద్యోగం పోతే తనకు మళ్లీ జాబ్ లభించదేమోనని హరిణి తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఉన్న ఉద్యోగం పోతే తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి వస్తుందని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.ఉద్యోగం కోల్పోతాతనని మనస్తాపానికి గురైన హరిణి ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలిలోని సైబర్ హీల్స్ వెంకటేశ్వర ఉమెన్ హాస్టల్‌లో తాను నివాసం ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం (నవంబర్ 19) రాత్రి 8.45 గంటల సమయంలో హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో హరిణి తన చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుంది

Related Posts