YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

దోమలకు నిలయం....రోగాలకు స్వాగతం...

దోమలకు నిలయం....రోగాలకు స్వాగతం...

దోమలకు నిలయం....రోగాలకు స్వాగతం... 
వనపర్తి నవంబర్ 20  
మురుగునీరు మురికి కాల్వ లోనే నిలవడం వల్ల దోమలకు ,పందులకు, పాములకు నిలయంగా మారి రోగాలకు స్వాగతం పలుకుతున్నాయని గోపాల్ పేట లోని పోచమ్మ గడ్డ ప్రాంత మహిళలు విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతం ఏర్పడి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంటర్నల్ రోడ్ల సౌకర్యం, మురుగుకాలువ లేకపోవడం వల్ల తాము పడే ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి దీనిని గమనిస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై వారు ఆగ్రహావేశాలను వెలిబుచ్చుతున్నారు. కాలనీలో ఒకే చోట మురుగు కాలువలను ఏర్పాటు చేశారు తప్ప మురుగునీరు వెళ్లేందుకు కాల్వల నిర్మాణం చేయకపోవడం వల్ల మురుగు నీరు అంతా కాల్వలోనే నిలిచి దోమలకు నిలయంగా మారిపోయిందనీ వారు విమర్శించారు. ఈ పరిస్థితి నెలకొని ఏళ్లు గడుస్తున్నా , నాయకులు మారుతున్న కూడా మా కాలనీ మాత్రం ఏ మాత్రం మారడం లేదని వారు విమర్శించారు. అసలే రోగాల సీజన్ ఈ కాలనీలో ఉన్న చిన్నారుల అంతా పలు వ్యాధులతో బాధ పడగా ఇటీవలే ముగ్గురు చిన్నారులు డెంగ్యూ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైన్ ఫ్లూ విజృంభిస్తున్న ఆ వ్యాధికి ఎక్కడ గురువుతమోనని మహిళలు ఆందోళనలు వ్యక్తపరుస్తున్నారు. దోమల నివారణకు, పందుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారే తప్ప ఇంతవరకు ఏటువంటి చర్యలు చేపట్టడం లేదని వారు విమర్శించసాగారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మురుగునీరు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ కాల్వను ఏర్పాటు చేసి దోమల నుంచి పందుల నుంచి విముక్తి పరచాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Related Posts