YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆస్తి-పాస్తులు ఆంధ్ర ప్రదేశ్

 30లోగా లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించాలి సమాచార శాఖ ఉప సంచాలకులు వి. మణిరాం

 30లోగా లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించాలి సమాచార శాఖ ఉప సంచాలకులు వి. మణిరాం

 30లోగా లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించాలి
సమాచార శాఖ ఉప సంచాలకులు వి. మణిరాం
విశాఖపట్నం, నవంబర్ 20, 
జిల్లాలో పింఛను పొందుతున్న వృద్ధ కళాకారులు ఈ నెల 30లోగా లైఫ్ సర్టిఫికేట్లను తమ కార్యాలయానికి సమర్పించాలని సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు వి. మణిరాం తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలో వృద్ధ కళాకారుల పింఛన్లను పొందుతున్న వారందరూ ప్రతీ ఏటా సమర్పించే లైఫ్ సర్టిఫికేట్లను నవంబర్ 30లోగా జిల్లా పరిషత్ కార్యాలయంనకు దగ్గరలో ఉన్న ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్నం వారికి స్వయంగా సమర్పించాలని కోరారు.  ఇప్పటివరకు వృద్ధ కళాకారుల ఖాతాలలో పింఛన్లు జమకాబడనట్లయితే అటువంటి ఖాతా పుస్తకాన్ని సంబంధిత బ్యాంకు నందు అప్ డేట్ చేయించి దాని ప్రతిని, ఆధార్ కార్డు ప్రతిని, స్వీయ దరఖాస్తు ఫారాన్ని తమ కార్యాలయానికి సమర్పించాలని కోరారు. గడువులోగా లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించిన వృద్ధ కళాకారులకు మాత్రమే సంచాలకులు, భాషా మరియు సాంస్కృతిక శాఖ, విజయవాడ వారి నుండి పింఛన్లు జమచేయబడతాయని స్పష్టం చేసారు. వృద్ధ కళాకారులు సమర్పించిన లైఫ్ సర్టిఫికేటు నందు పాస్ పోర్టు సైజు ఫొటోను అతికించి తమ పేరు, వయస్సు, చిరునామా, పిన్ కోడ్, ఫోన్ నెంబరుతో పాటు  ఆధార్ నెంబరు , బ్యాంకు ఖాతా, ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్ తప్పనిసరిగా ఉండాలని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. ఈ విషయమై ఎటువంటి సందేహాలు ఉన్నఎడల 8985157424 మొబైల్ నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.  

Related Posts