YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మద్యం దందాలో చీకటి ఒప్పందాలు

మద్యం దందాలో చీకటి ఒప్పందాలు

మద్యం దందాలో చీకటి ఒప్పందాలు
విజయవాడ నవంబర్ 21
సిఎం జగన్మోహన్ రెడ్డి, మీ మంత్రులు, ఎమ్మెల్యే లతో మత విశ్వాసాలను దెబ్బ తీసేలా మాట్లాడుతున్నారు. మాల ధారణలో ఉండి మమ్మలను తిట్టించడానికి  నీచమైన భాష వాడుతున్నారు. ఇలా నోరేసుకుని పడితేనే మీ అపాయింట్మెంట్ లు దక్కు తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. సిమెంట్ కంపెనీలు తో కుమ్మక్కై ధరలు పెంచేసింది వాస్తవం కాదా. మద్యం బార్లు, కంపెనీలతో కూడా చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. వీటిని ప్రశ్నిస్తే, నా పై ఎదురు దాడి చేస్తున్నారని విమర్శించారు. ఇసుక విషయంలో 68మంది పై ఫిర్యాదులు వస్తే, వారి పై సిఎం ఎందుకు చర్యలు తీసుకోలేదు. పోలవరం చూడని వారు నేడు నన్ను తిడుతున్నారు. పోలవరం విషయంలో మంత్రి పత్తా లేడు... సిఎం నోరు విప్పడు. గిన్నీస్ రికార్డు ఎక్కిన కంపెనీలను పక్కన పెట్టేశాడని అన్నారు. ముఖంనచ్చక పోయినా, అడిగిన మామూళ్లు ఇవ్వకపోయినా కాంట్రాక్టు రద్దు చేస్తున్నారు. మీ తప్పు లను ప్రశ్నిస్తే అయ్యప్ప మాల వేసుకున్న వారితో తిట్టిస్తున్నారు. 151 ఎమ్మెల్యే లు ఉన్నా.. సిఎం అభద్రతా భావంతో బతుకుతున్నారని అన్నారు. తిరుమల పై కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తే జగన్ ఎందుకు స్పందించ లేదు. అన్యమత ప్రచారం ఆపాల్సిన బాధ్యత టిటిడి ఛైర్మన్ గా  వై.వి. సుబ్బారెడ్డి కి బాధ్యత లేదా. స్వర్ణ కాటేజీ లో కూడా రాజకీయాలు చేసింది మీరు. స్వామి వారి అన్న ప్రసాదంతో   పార్టీ లు చేస్తారా అని ప్రశ్నించారు. తిరుమల వంటి పవిత్ర ప్రదేశాన్ని పంచాయతీ లకు అడ్డాగా మార్చారు. మైలవరం నియోజకవర్గం లో నోట్లను చించి, స్లిప్పులు ఇచ్చింది వైసిపి నేతలే. ఎన్నికల సమయంలో కరెన్సీ నోట్ల ను చించి పంచే అధికారం ఎవరిచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. సిఎం, పోలీసులు స్పందించి బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలి. అయ్యప్ప మాలలో ఉన్న ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించాలి. ఇలాంటివి బయట పెడుతున్న నన్ను తిట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇటువంటి మాఫియా సంస్కృతిని ప్రోత్సహించే వారిని తరిమి కొట్టాలి. మీడియా ప్రసారం చేయకపోయినా...సోషల్ మీడియా స్పందించింది. 2430 జి.ఒ వల్ల కొన్ని మీడియా సంస్థ లు జగన్ కు భయపడుతున్నాయి.కరెన్సీ నోట్లను ముక్కలు చేసిన విషయం పై ఆర్.బి.ఐ కూడా స్పందించాలి. క్షేత్ర స్థాయిలో విచారిస్తే అందరికీ వాస్తవాలు తెలుస్తాయని ఉమ అన్నారు.

Related Posts