YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల్ని తిప్పిపంపుతున్న డిపో మేనేజర్లు

ఆర్టీసీ కార్మికుల్ని తిప్పిపంపుతున్న డిపో మేనేజర్లు

ఆర్టీసీ కార్మికుల్ని తిప్పిపంపుతున్న డిపో మేనేజర్లు
వరంగల్‌ నవంబర్ 21
విధుల్లో చేరేందుకు వెళ్లిన..ఆర్టీసీ కార్మికుల్ని డిపో మేనేజర్లు తిప్పిపంపుతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. గురువారం పరకాలలో డ్రైవర్లు సంపత్‌, రత్నం విధుల్లోకి చేరేందుకు రాగా.. డిపో మేనేజర్లు వెనక్కిపంపారు. దీంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.కాగా 48 రోజుల సమ్మెలో జేఏసీ విఫలమైందని ఆర్టీసీ యూనియన్‌ నేతలు అన్నారు. ప్రధాన డిమాండ్‌ విలీనాన్ని పక్కన పెట్టారని చెప్పారు. ఆర్టీసీలో 11 యూనియన్లు ఉంటే కేవలం 3 యూనియన్లే జేఏసీగా ఏర్పడ్డాయన్నారు. సీఎం పెట్టిన డెడ్‌లైన్‌లోపే విధుల్లో చేరి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదన్నారు.

Related Posts