YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

అవినీతి లేని పాలనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయం

Highlights

• పారదర్శకతకోసం ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొంటాం
• లూలూ గురించి పత్రికలలో కథనాలే తప్ప అధికారిక ప్రకటన లేదు
• లూలూకు కేటాయించిన భూములలో న్యాయపరమైన ఇబ్బందలున్నాయ్
• వాస్తవ భూమి ధరలకు, లూలూ చెల్లించే అద్దెకు పొంతన లేకే రద్దు చేసుకున్నాం
• అనంతపురంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కేంద్రంతో ఒప్పందం పూర్తి

అవినీతి లేని పాలనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయం

అవినీతి లేని పాలనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయం
అమరావతి, నవంబర్, 21
గత ప్రభుత్వంలో ఒప్పందాలు కుదిరి విశాఖపట్నంలో కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటళ్లపై పెట్టుబడులు పెట్టాలనుకున్న లూలూ గ్రూప్ భవిష్యత్ లో పెట్టుబడులు పెట్టదని ప్రకటించినట్లు మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. పత్రికాప్రకటన, మెయిల్ వంటి అధికారిక ప్రకటనలు లేకుండా జరుగుతున్న అసత్య కథనాలు, ప్రచారాన్ని మంత్రి ఖండించారు. గత ప్రభుత్వం హయాంలో 2018 ఫిబ్రవరిలో లూలూ ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి వెల్లడించారు. ఆ లూలూ ప్రాజెక్టుకు కేటాయించిన 13.83 ఎకరాల భూమి కేసుల్లో ఉందని,  న్యాయపరమైన చిక్కులున్న భూమిని అప్పగించడంపై  నాటి ఏపీఐఐసీ ఎండీ రాసిన లేఖను గురించి  మంత్రి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి మొదటి నుంచి చెబుతున్నట్లు పారదర్శక పాలనకే పెద్దపీట వేస్తున్నామన్నారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ప్రచారాలు, కథనాలు రాసినా అబద్ధాలు నిజం కాబోవన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి.  తప్పును తప్పని చెప్పకుండా అదే తప్పుదారిలో వెళ్లడం సరైంది కాదని, అందుకే గత ప్రభుత్వంలోని ఇష్టారీతిన జరిగిన లోపాయికారి ఒప్పందాలను నేరుగా ప్రజలముందుంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సచివాలయంలోని ప్రచారవిభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..లూలూ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని మంత్రి వివరించారు. లూలూతో ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసుకోవడానికి బిడ్డింగ్ లో పారదర్శకత లేకపోవడం మొదటి కారణం కాగా, లూలూకు కేటాయించిన భూమి చాలా విలువ ఉన్నా.. అది చాలా తక్కువ ధరకే అప్పగించడం ప్రజాధనం వృథా చేయడంగా భావించి లూలూతో రద్దు చేసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. లూలూకు కేటాయించిన భూమికి మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుత ధర ఎకరాకు సుమారు రూ. 40-42 కోట్ల వరకూ ఉంటుందని మంత్రి తెలిపారు. అంత విలువైన భూమికి సరిగ్గా లెక్కేస్తే గత ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఒక్కో చదరపు అడుగుకు 5 రూపాయలు కూడా రాదని మంత్రి వ్యాఖ్యానించారు.  తక్కువ ధరకే అద్దెకు ఇవ్వడం కారణంగా సుమారు 500 కోట్లపైనే  ఏడాదికి ప్రజాధనం వృథా అవుతుందనే కోణంలో ఆలోచించి తమ ప్రభుత్వం లూలూతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టును రద్దు చేసుకుందని మంత్రి మేకపాటి వివరించారు. గత ప్రభుత్వం రూ.2200 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని పత్రికల్లో వార్తలకోసం చేసిన ఆర్భాటపు ప్రచారాల వల్లే ఇదంతా జరిగిందన్నారు మంత్రి. గత ప్రభుత్వం హయాంలో ఒప్పందం చేసుకుని తర్వాత కూడా అదే ప్రభుత్వం సంవత్సరకాలం వరకూ పాలన కొనసాగినా లూలూ ఏ పనులు చేపట్టకపోయినా చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. ఇదంతా కేవలం గత ప్రభుత్వ తప్పిదం, నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు. ఏపీఐఐసీలో ప్రస్తుతం ఎంతో టెక్నాలజీ ఉందని, అది వినియోగించుకుని అధునాతన భవనాలు నిర్మించగలమని మంత్రి హైదరాబాద్ లో నిర్మించిన హైటెక్స్ ఉదాహరణగా చెప్పారు.

Related Posts