YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

భారీ స్కోరు దిశగా భారత్

భారీ స్కోరు దిశగా భారత్

భారీ స్కోరు దిశగా భారత్
కోల్ కత్తా, నవంబర్ 23,
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. విరాట్‌ కోహ్లీ(136: 194 బంతుల్లో 18ఫోర్లు) భారీ శతకంతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 200కు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. 81 ఓవర్లు ఆడిన భారత్‌ 6 వికెట్లకు 309 పరుగులు చేసింది. దీంతో భారత్‌ 203 పరుగుల ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఇబదాత్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో విరాట్‌.. తైజుల్‌ ఇస్లాం చేతికి చిక్కాడు. విరాట్‌ ఔట్‌తో బంగ్లా ఊపిరిపీల్చుకుంది. అశ్విన్‌(0), సాహా(13) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని కోహ్లీసేన భావిస్తోంది.తొలి సెషన్‌లో కోహ్లీ, జడేజా(12) కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకుముందు రహానెతో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. వీలుచిక్కినప్పుడల్లా టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేస్తున్న విరాట్‌కు జడ్డూ సహకారం అందించాడు. పరుగులేమీ ఎక్కువగా చేయకపోయినప్పటికీ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ విరాట్‌కు అండగా ఉన్నాడు. లంచ్‌ బ్రేక్‌ తర్వాతి ఓవర్‌లో జడేజా వెనుదిరిగాడు. అబు జాయేద్‌ బౌలింగ్‌లో అతడు బౌల్డ్‌ అయ్యాడు. కోహ్లీకి జోడీగా వృద్ధిమాన్‌ సాహా క్రీజులో ఉన్నాడు. రెండో సెషన్‌ భారత్‌కు చాలా కీలకం. ఈ సెషన్‌లోనే బంగ్లా ఇన్నింగ్స్‌లో భారత్‌ నిన్నటి ఆటలో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టింది. సూర్యాస్తమ సయయంలో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడుతారనేది ఆసక్తికరంగా మారింది. శనివారం ఆట తొలి సెషన్‌లో 30 ఓవర్లు ఆడిన భారత్‌ 115 పరుగులు రాబట్టింది. ఈ సెషన్‌ అంతా కోహ్లీ దూకుడే కొనసాగింది.

Related Posts