YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వింతలు తెలంగాణ

భర్తకు మరో పెళ్లి చేసిన భార్య

భర్తకు మరో పెళ్లి చేసిన భార్య

భర్తకు మరో పెళ్లి చేసిన భార్య
భువనేశ్వర్, నవంబర్ 25
 కట్టుకున్న భర్తకు మరో మహిళతో రెండో పెళ్లి జరిపించిందో వీర నారీమణి. వేరొక మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఈ నిర్ణయం తీసుకుంది. తన భర్త రెండో పెళ్లికి అన్నీ తానై వ్యవహరించింది. ఇరు కుటుంబాలను.. ఊరి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి జరిపించింది. ఈ ఆశ్యర్యకర సంఘటన ఒడిశాలో జరిగింది.భర్తకు భార్య స్వయంగా పెళ్లి చేసిన ఆశ్చర్యకర ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో జరిగింది. మత్తిలి సమితికుమార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసీకి కొన్నేళ్ల క్రితం గాయత్రి అనే యువతితో వివాహం జరిగింది. రామ కావసీ రోజువారీ కూలీ పనుల కోసం కొంతమంది కార్మికులతో కలిసి చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఐత మడకామి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లి చేసుకోవాలని రామ కావసీని ఐత మడకామి అడిగింది. పెళ్లి చేసుకోకపోతే తనను మోసం చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. అందుకు రామ ఒప్పుకోలేదు. తనకు గతంలోనే పెళ్లయిందని, ఇప్పట్లో పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పడంతో తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని మత్తిలి పోలీస్‌ స్టేషన్‌లో ప్రియుడు రామ కావసీపై ఐత మడకామి కేసు పెట్టింది.ఊళ్లోని సిద్ధీశ్వర్ మందిరానికి భర్తని.. అతని ప్రియురాలిని వెంటబెట్టుకెళ్లి పూజారి సమక్షంలో గ్రామస్తుల మధ్య వారిద్దరినీ ఒక్కటి చేసింది. ఇక నుంచి ఎలాంటి గొడవలు లేకుండా ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉంటామని వారు చెప్పడంతో విస్తుపోవడం స్థానికుల వంతైంది.

Related Posts