YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

గాయంతో ధావన్ ఔట్

గాయంతో ధావన్ ఔట్

గాయంతో ధావన్ ఔట్
ముంబై, :
భారత విధ్వంసక ఓపెనర్ శిఖర్ ధావన్‌ గాయంతో వచ్చేనెలలో వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ధావన్ గాయపడగా.. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత అతనికి విశ్రాంతి అవసరమని తేలింది. ఈక్రమంలో అతని ప్లేస్‌లో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శామ్సన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు భారత జట్టులోకి ఎంపికైనా ప్లేయింగ్ లెవన్‌లో సంజూకు చోటు దక్కలేదు. వరుసగా విఫలమవుతున్నా రిషభ్ పంత్‌కు అవకాశాలివ్వడంపై టీమ్ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈక్రమంలో వెస్టిండీస్ సిరీస్‌లో శామ్సన్‌కు తుదిజట్టులో ఆడే అవకాశం ఇస్తారో, లేదో చూడాలి.మరోవైపు డొమెస్టిక్ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సంజూ.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ కేరళ ప్లేయర్.. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి ఈ మూడు టీ20ల సిరీస్ మొదలవుతుండగా.. హైదరాబాద్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది.

Related Posts

0 comments on "గాయంతో ధావన్ ఔట్"

Leave A Comment