YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ శ్రేణులు

మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ శ్రేణులు

మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ శ్రేణులు
నల్లగొండ  డిసెంబర్ 02   
మున్సిపాలిటీలో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి పార్టీ నేతలు నల్లగొండ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. బిజెపి కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన బిజెపి నేతలు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడి యత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు మున్సిపల్ కార్యాలయం వద్ద బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల వలయాన్ని దాటుకుని కొందరు బిజెపి నేతలు కౌన్సిలర్ లు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపాలిటీలలో సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. మున్సిపాలిటీలో కనీస సౌకర్యాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. వెంటనే మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని లేకపోతే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నూకల నరసింహ రెడ్డి, బిజెపి ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Related Posts