YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

బాలికపై అఘాయిత్యం...నగ్నంగా ఊరేగింపు

బాలికపై అఘాయిత్యం...నగ్నంగా ఊరేగింపు

బాలికపై అఘాయిత్యం...నగ్నంగా ఊరేగింపు
ముంబై, డిసెంబర్ 2,
దేశంలో మహిళలు, చిన్నారులపై వరుసగా జరుగుతున్న లైంగిక దాడులపై ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. కామాంధులను బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్ పెరుగుతున్న వేళ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శిక్షిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని చితక్కొట్టి వీధుల్లో నగ్నంగా ఊరేగించారు.నాగ్‌పూర్‌కు చెందిన వైద్య అనే వ్యక్తి స్థానిక కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్‌లో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఫైనాన్స్ తీసుకున్న వారి ఇంటికెళ్లి వాయిదాలు కలెక్షన్ చేయడం అతడి విధి. ఈ క్రమంలోనే రోజూ ఓ ఇంటికెళ్లి డబ్బులు కలెక్ట్ చేసేవాడు. దీంతో ఆ కుటుంబంలోని బాలికతో అతడికి చనువు ఏర్పడింది. అప్పుడప్పుడూ ఆ బాలికకు చాక్లెట్లు, బిస్కట్లు కొనిస్తూ మచ్చిక చేసుకున్నాడు.ఆదివారం డబ్బుల కోసం వారి ఇంటికెళ్లిన సమయంలో ఇంట్లో పెద్ద వాళ్లెవరు లేదు. దీంతో వైద్య బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో ఆమె తల్లి ఇంట్లోకి వచ్చింది. బాలికతో అసభ్యకర రీతిలో కనిపించిన వైద్య చెంపలు వాయిస్తూ బయటకు లాక్కెళ్లింది. ఈలోగా స్థానికులు గుమిగూడి ఈ కామాంధుడిని చితకబాదారు. కాళ్లు చేతులు కట్టేసి వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related Posts