YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం

పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం

ములుగు
రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన తెలంగాణ నయాగరా గా పేరు గాంచిన బొగత జలపాతాల్లో వరద ఉధృతితో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జలపాతాల వద్ద సందర్శకుల రాకను అధికారులు తాత్కాలికంగా నిషేధించారు.వర్షాల ధాటికి జలపాతాల వద్ద నీటి ప్రవాహం అత్యంత వేగంగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాపాయం ఉన్నందున ప్రయాణికులు, పర్యాటకులు జలపాతాల వైపు రాకూడదని అధికారులు హెచ్చరించారు.పోలీసులు, అటవీశాఖ, పర్యాటకశాఖ అధికారులు అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి సందర్శకుల ప్రవేశాన్ని పూర్తిగా ఆపివేశారు.బొగత జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వర్షాకాలంలో ఇవి మరింత అందంగా మారుతాయి. అయితే అధిక వరద ప్రవాహం కారణంగా ఈ ప్రాంతం ప్రమాదకరంగా మారడంతో ప్రజలు అక్కడికి వెళ్లరాదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాతావరణ శాఖ సూచనల మేరకు జలపాతాల పరిసరాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related Posts