
ములుగు
ములుగు జిల్లాలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి గారు విజ్ఞప్తి చేశారు.బంగాళాఖాతంలో అల్పపీడన ధోరణి వల్ల జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదని,లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. వాతావరణ శాఖ సూచన మేరకు మృత్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని ఆమె తెలిపారు.భారీ శబ్దాలతో ఉరుములు కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు వస్తున్నాయంటే పిడుగులు పడతాయని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఈ పిడుగుపాటుకు పశువులు, ప్రజలు మరణిస్తున్నారని, ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల్లో, చెట్లకింద ఉన్నవారే ఈ పిడుగుపాటుకు గురవుతున్నారని ఆమె అన్నారు. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లక పోవడమే ఉత్తమమని తెలిపారు.లోతట్టు మండలాలైన కన్నాయిగూడెం, ఏటురునాగారం మంగపేట, తాడ్వాయి, ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని కోరారు