YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఫిర్యాదును తక్షణమే పరిష్కరించండి.. ఏఎస్పీ షాకీర్ హుస్సేన్.. 

ఫిర్యాదును తక్షణమే పరిష్కరించండి.. ఏఎస్పీ షాకీర్ హుస్సేన్.. 

ఫిర్యాదును తక్షణమే పరిష్కరించండి.. ఏఎస్పీ షాకీర్ హుస్సేన్.. 
వనపర్తి డిసెంబర్ 2 
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుల ను తక్షణమే పరిష్కరించి ఫిర్యాదు దారులకు న్యాయం చేకూర్చాలని జిల్లా అదనపు ఎస్పి షాకీర్ హుస్సేన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పదిమంది ఫిర్యాదు దారులు విచ్చేసి వారి ఫిర్యాదులను అదనపు ఎస్పీ కి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ తగాదాల పై అయిదు, రెండు భార్య భర్తల తగాదా, మూడు ఇతర తగాదాల పై ఫిర్యాదు రాగా పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related Posts