YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి కళలు ఆంధ్ర ప్రదేశ్

ఆన్ లైన్ వ్యాపారంలో టెర్రకోట కళాకారులు

ఆన్ లైన్ వ్యాపారంలో టెర్రకోట కళాకారులు

ఆన్ లైన్ వ్యాపారంలో టెర్రకోట కళాకారులు
తిరుపతి, 
చిత్తూరుజిల్లాలో టెర్రకోట కళాకారులకు పలమనేరు ప్రసిద్ధి. పట్టణానికి సమీపంలోని టెర్రకోట కాలనీలో సుమారు వంద కుటుంబాలకు ఈ కళే జీవనోపాధి. వీరికి మరింత చేయూతనందించడమే లక్ష్యంగా గంటావూరు సమీపంలో రూ.2కోట్లతో డీఆర్‌డీఏ ‘టెర్రకోట హబ్‌’ను ఏర్పాటు చేసింది.టెర్రకోట హబ్‌లో తయారైన కళాకృతులను బెంగళూరుకు చెందిన పలు కంపెనీల ద్వారా ఆన్‌లైన్‌లో దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు. అయితే టెర్రకోట కళాకారులే ఆన్‌లైన్‌లో విక్రయించుకునేలా డీఆర్‌డీఏ ప్రయత్నిస్తోంది. ఏదేమైనా పలమనేరు మట్టి విదేశాలకు సైతం చేరుతుండడం విశేషం. ఇందులో  టెర్రకోట కళాకారులు ఇప్పటి వరకు తయారు చేస్తున్న వస్తువులకు  పశ్చిమ బెంగాల్, ఒడిశా డిజైన్లను జోడించి విభిన్న ఆకృతులను సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే అధిక సంఖ్యలో యువతీయువకులను టెర్రకోట కళలో నిపుణులుగా తీర్చిదిద్ది వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.టెర్రకోట హబ్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఏపీఎస్‌డీసీఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌), సీఎఫ్‌సీ (కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌), టెర్రకోట హస్తకళాకారుల ఎయిడెడ్, రీచ్‌ సంస్థల ఆధ్వర్యంలో యువతకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి ప్రత్యేకంగా శిక్షకులను రప్పించారు. వీరి పర్యవేక్షణలో 50మంది నెల రోజులపాటు శిక్షణ పొందారు. తొలి బ్యాచ్‌కు టెర్రకోట హబ్‌లోనే ఉపాధి కల్పించారు. కావాలనుకుంటే వారు ఇళ్ల వద్ద కూడా కళాకృతులను తయారు చేసుకుని ఉపాధి పొందవచ్చు.నూతన సాంకేతికతను అందిపుచ్చుకున్న టెర్ర కోట కళాకారులు విభిన్న ఆకృతులను తయా రు చేస్తున్నారు. వాటికి ప్రస్తుత మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కూడా ఏర్పడింది. ముఖ్యంగా కొళాయి అమర్చిన మట్టి కూజాలు, వేలాడే కుండీలతోపాటు శుభకార్యాల్లో బహుమతులు గా ఇచ్చేందుకు పలు కళాకృతులను రూపొందిస్తున్నారు. చివరకు ఫొటోఫ్రేమ్‌లను సైతం మ ట్టితో తయారుచేయడం విశేషం.గతంలో మట్టికుండలు తయారీలో వినియోగించే కుమ్మరిసారెకు బదులు ఎలక్ట్రిక్‌ వీల్‌ మెషీన్‌ వచ్చింది. బంకమట్టిని కాళ్లతో తొక్కాల్సిన అవసరం లేకుండా ప్లగ్‌మిల్‌ మిక్చర్‌ అనే యంత్రం అందుబాటులో ఉంది. మట్టి  వస్తువులను బట్టీ్టలో కాల్చే పనిలేకుండా విద్యుత్‌లో నడిచే సిలన్‌ వచ్చింది. దీంతోపాటు బాల్‌మిల్, ఫిల్టర్లు, కట్టర్లు.. ఇలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి బొమ్మల తయారీకి యంత్రాల వాడకంపై హస్త కళాకారులకు టెర్రకోట హబ్‌లో శిక్షణ ఇస్తున్నారు.

Related Posts