YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు సినిమా

ఆర్జీవీ మూవీకి రిలీజ్ కష్టాలు...

ఆర్జీవీ మూవీకి రిలీజ్ కష్టాలు...

ఆర్జీవీ మూవీకి రిలీజ్ కష్టాలు...
హైద్రాబాద్, డిసెంబర్ 3, 
సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. నవంబర్‌లోనే రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా సెన్సార్‌ సమస్యలతో కష్టాల్లో పడింది.రాజకీయాలపై సెటైరికల్‌గా తెరకెక్కించిన ఈ సినిమాకు ముందుగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశాడు వర్మ. అదే పేరుతో చాలా రోజుల పాటు ప్రమోట్ చేశాడు. టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ నుంచే ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా మారిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. రిలీజ్‌ సమయానికి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో సెన్సార్‌ ఇబ్బందులు తప్పవని ముందే అంచనా వేసిన వర్మ సినిమా టైటిల్‌ను `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు`గా మార్చాడు. అయితే టైటిల్‌ మార్చినా సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు సెన్సార్‌ బోర్డ్‌ నిరాకరించింది.సినిమా టైటిల్‌ కన్నా.. వర్మ రూపొందించిన పాత్రలో సినిమా సెన్సార్‌కు ప్రధాన సమస్య అని తెలుస్తోంది. డైరెక్ట్‌గా ప్రస్తుత రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న వ్యక్తులను టార్గెట్‌ చేయటంతో సినిమా రిలీజ్‌ అయితే వివాదాలు తప్పవని భావిస్తున్నారు. అందుకే రివైజింగ్‌ కమిటీ దగ్గర కూడా వర్మకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తాను ఎవరినీ ఉద్దేశించి పాత్రలు రూపొందించలేదని ఎంత చెప్పినా, వర్మ అసలు ఉద్దేశం ఏంటో అందరికీ తెలిసిందే. ఆ కారణంగానే సెన్సార్‌ సర్టిఫికేట్‌ విషయంలో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఈ విషయంలో వర్మ మాత్రం పట్టు వీడటంలో లేదు. ఇప్పటికే సెన్సార్‌ బోర్డ్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు వర్మ. `మేం ఎలాంటి సినిమాలు చూడాలో వారు ఎలా నిర్ణయిస్తారు. నన్ను ఎంత తొక్కితే అంత రెచ్చిపోతా. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సీక్వెల్‌ కూడా తీస్తా` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వర్మ వర్సెస్‌ సెన్సార్‌ బోర్డుగా మారిన ఈ వివాదానికి ఎక్కడ ఫుల్‌ స్టాప్‌ పడుతుందో చూడాలి.

Related Posts