YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆస్తి-పాస్తులు ఆంధ్ర ప్రదేశ్

 అడ్డూ, అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు

 అడ్డూ, అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు

 అడ్డూ, అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు
రాజమండ్రి, డిసెంబర్ 4,
రాజమహేంద్రవరంలో గుడా, కార్పొరేషన్‌ అనుమతులు లేకుండానే మల్టీప్లెక్స్‌ నిర్మాణం ప్రారంభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గుడా, కార్పొరేషన్‌ అనుమతులు లేకుండానే మల్టీపెక్స్‌ నిర్మాణం ప్రారంభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారుల హస్తం ఉందనే వాదనలూ ఉన్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులకు రూ.కోట్లలో డీల్‌ కుదిందనే ప్రచారం జరుగుతోంది. అందువల్లే అనుమతులు లేకపోయినప్పటికీ యథేచ్ఛగా మల్లీప్లెక్స్‌ నిర్మాణం ప్రారంభమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. నగరంలో మధ్యతరగతి ప్రజలు భవనంపై ఒక గది ఏర్పాటు చేస్తే నానా హంగామా చేస్తున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఇంత పెద్ద నిర్మాణం జరుగుతున్నా కన్పించకపోవడం వెనుక రూ.కోట్లు చేతులు మారాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారుమల్టీప్లెక్స్‌ చుట్టూ రోడ్లు ఉండేందుకు పక్కనే ఉన్న అపార్టుమెంట్‌ను బలహీనపర్చారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ అపార్టుమెంటులోని ఓనర్లను భయపెట్టి దాన్ని కాజేసేందుకు కొందరు రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు. కచ్చితంగా అపార్టుమెంటును ఖాళీ చేయాల్సిందేనని బెదిరింపులకు సైతం దిగుతున్నట్టు సమాచారం. రాజమహేంద్రవరం ఎవి అప్పారావు రోడ్డులో గెయిల్‌ కార్యాలయం ఎదురుగా మల్టీప్లెక్స్‌ నిర్మాణం జరుగుతోంది. దీనికి రాజమమేంద్రవరం కార్పొరేషన్‌ నుంచి గాని, గుడా నుంచి గాని అనుమతులు లేవు. అనుమతులు లేకుండానే నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. ఇదిలా ఉండగా మల్టీప్లెక్స్‌ నిర్మాణాలకు ఆనుకుని తూర్పువైపున జిఇవి గ్రాండ్‌ అపార్టుమెంటు ఉంది. ఇందులో మొత్తం 35 ప్లాట్లు ఉన్నాయి. 20 ప్లాట్లలో ఇప్పటికే నివాసం ఉంటున్నారు. ఈ స్థలంపై మల్టీప్లెక్స్‌ యాజమాన్యం కన్నుపడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఆపార్టుమెంటును కాజేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి యాజమాన్యం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే అపార్టుమెంట్‌కు అత్యంత చేరువలో భారీ గోతులు తీయించి అపార్ట్‌మెంట్‌ను బలహీనపర్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గోతులవల్ల జిఇవి అపార్ట్‌మెంట్‌ గోడ పడిపోయింది. నాలుగు పిల్లర్లు బీటలు వారాయి. దీంతో అపార్టుమెంటులో ఉంటున్నవారు వాటిని ఖాళీ చేశారు. ఈ సమయంలో పెద్దలు రంగప్రవేశం చేసి ప్లాటుకు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకూ ఇస్తామని ప్లాట్ల యజమానులతో బేరాలకు దిగినట్టు సమాచారం. ఈ విషయం మీడియాకు చెబితే తమకు ప్రజా ప్రతినిధుల వల్ల ఇబ్బందులు వస్తాయని ప్లాటు ఓనర్లు నోరువిప్పలేని పరిస్థితి నెలకొంది. అపార్టుమెంటును కచ్చితంగా ఖాళీ చేయాల్సిందేనని కొందరు రాజకీయ నాయకులు ప్లాటు జయమానులను బెదిరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మల్టీప్లెక్స్‌కు పదివేల గజాల్లో మూడు సెల్లార్లు, జిప్లస్‌ 5లో కూడిన భారీ షాపింగ్‌మాల్‌ నిర్మించేందుకు నగరపాలక సంస్థ, గుడా అనధికారికంగా సహకరించాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆరు సినిమా హాళ్లు, వ్యాపార సముదాయాలతో నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్‌పై జిల్లాలో చర్చ సాగుతోంది. జిఇవి గ్రాండ్‌ అపార్టుమెంటుకు ఎన్‌ఒసి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు నిలిపివేయడం, అపార్టుమెంటు గోడ కూలేలా 70 అడుగుల మేర గోడ అంచును ఆనుకుని తవ్వేయడం, అపార్టుమెంటులోని మధ్య బ్లాక్‌లోని నాలుగు ఫిల్లర్లను నెర్రలు వేసేలా పాడుచేయడం ఉద్దేశ్యపూర్వకంగానే చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ప్లాట్ల యజమానులకు తెలిసినా యటకు చెప్పేందుకు వారు జంకుతున్నారు.అపార్టుమెంటు నివాసయోగ్యం కాదనే భయాన్ని ఓనర్లలో అధికారులు, ప్రజా ప్రతినిధులు నింపేశారు. ఈ అపార్టుమెంటు ప్రస్తుతం నివాసయోగ్యమో కాదో తేల్చాల్చి నివేదిక ఇవ్వాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులను రెవెన్యూ అధికారులు కోరారు. ఇంజినీరింగ్‌ అధికారులు ఇది నివాస యోగ్యం కాదని తేలుస్తారు. దీంతో దీనిని చౌకగా కొనేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కుట్రలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  అన్యాయాన్ని చెప్పుకునేందుకు బాధితులు భయపడుతున్నారు. మల్టీప్లెక్సీ నిర్వాకం వల్ల ఫ్లాట్ల యజమానులు తీవ్ర వ్యథతో ఉన్నారు. ప్రజా ప్రతినిధులు వారిని అనేక రకాలుగా భయపెడుతుండటంతో వారు నోరు విప్పలేకపోతున్నారు.

Related Posts