YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు.  నెల్లూరు

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు.  నెల్లూరు

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు.
 నెల్లూరు డిసెంబర్ 4
 స్థానిక నెల్లూరు నగరంలోని ఏకే నగర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ కార్యాలయంలో గురువారం చిన్న మధ్యతరహా పారిశ్రామిక వేత్తలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజర్ నాంచారయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన దిశగా వివిధ ఉద్యోగ ఉపాధి రంగాల వైపు నిరుద్యోగులను ప్రోత్సహిస్తూ తీసుకున్న నిర్ణయం లో భాగంగా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. నిరుద్యోగులు విద్యా రంగంలో వివిధ డిగ్రీలు పీజీలు చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడక, ఉపాధి రంగాల వైపు దృష్టి సారించాల్సి ఉందని తెలిపారు. తాము బతుకుతూ మరో పదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా నిరుద్యోగులు పారిశ్రామిక రంగాల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గురువారం కేకే నగర్  ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ కార్యాలయంలో చిన్న మధ్యతరహా ఔఉత్సాహ పారిశ్రామికవేత్తలకు నిర్వహించు అవగాహన సదస్సు కు ఏ పి ఐ ఐ సి మరియు రాష్ట్ర ఆర్థిక సంస్థ అధికారులు పాల్గొంటారని తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావాలని పిలుపునిచ్చారు

Related Posts