
ఆకతాయిలకు పోలీసుల వార్నింగ్
బెల్లంపల్లి డిసెంబర్ 5
రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి , మంచిర్యాలజిల్లా బెల్లంపల్లి లో అర్ధరాత్రి రోడ్లపై జులాయి గా తిరుగుతూ, అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా పేరుతో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లో పోలీసులు ముమ్మర తనిఖీ లు రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్పాత్లపై గుంపులుగా ఉన్న,ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న, అనుమాన స్పదంగా కనిపించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాత్రి రోజు పట్టుబడిన వారి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఇక ముందు అర్ధరాత్రి బైక్ రైడ్ ,మద్యం తాగడం హానికరమని మళ్ళీ దొరికితే కేసులు నమోదు చేస్తాం అని బెల్లంపల్లి ఏసీపీ హెచ్చరించారు