YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

సత్ఫలితాలిస్తున్న మిషన్ ఇంద్రధనుష్

సత్ఫలితాలిస్తున్న మిషన్ ఇంద్రధనుష్

సత్ఫలితాలిస్తున్న మిషన్ ఇంద్రధనుష్
రాజన్న సిరిసిల్ల డిసెంబర్ 5  
చిన్నారులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా 5 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్రం ప్రవేశ పెట్టిన మిషన్ ఇంద్రధనుష్ పథకం పెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సత్ఫలితాలనిస్తుంది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసెంబర్ 2 నుండి వారం రోజుల పాటు మిషన్ ఇంద్రధనుష్ పథకం పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా 272 జిల్లాల్లో ఈ పథకం అమలవుతుండగా, ఈ ఏడాది జిల్లాలో సిరిసిల్ల అర్భన్ లో మిషన్ ఇంద్రధనుష్ పై అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీకాలు వేయించుకోకుండా ఉన్న డ్రాపవుట్స్ పిల్లలను, గర్భణీ లను గుర్తించి టీకాలు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.మిషన్ ఇంద్రధనుష్ లో ఏడు రంగులు వలే చిన్నారుల జీవితాల్లో ప్రాణాంతకమైన డిప్తిరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, హైపటైటీస్ వంటి వ్యాధుల నుండి సంరక్షణ కోసం మిషన్ ఇంద్రధనుష్ పథకం కేంద్రం అమలు చేస్తుందని మిషన్ ఇంద్రధనుష్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రత్యేక అధికారి సుమన్ రావు తెలిపారు. ఈ వారం రోజుల పాటు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఇంటింటా సర్వే చేపట్టి టీకాలు వేయించుకోని చిన్నారులను, గర్భణీ లను గుర్తించారు. సిరిసిల్ల అర్భన్ లో 70 మంది పిల్లలను, 8 మంది గర్భిణులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిషన్ ఇంద్రధనుష్ పథకం లో భాగంగా చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో వంద శాతం టీకాలు వేయిస్తామని అధికారులు స్పష్టం చేశారు

Related Posts