YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కియా సంస్థ మరింతగా విస్తరించాలి :సీఎం వైఎస్.జగన్

కియా సంస్థ మరింతగా విస్తరించాలి :సీఎం వైఎస్.జగన్

కియా సంస్థ మరింతగా విస్తరించాలి
వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 3 లక్షల యూనిట్లకు చేరాలి 
తద్వారా మరెంతో మందికి ఉపాధి
కియా సంస్థకు ప్రభుత్వం పూర్తి అండదండగా ఉంటుంది
అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుంది:సీఎం వైఎస్.జగన్
అనంతపురం డిసెంబర్ 5 
అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కియా మోటర్స్‌ ప్లాంట్‌ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కియా మోటర్స్‌ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కియా మోటార్స్‌ బాటలోలో మరికొన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కియా మోటర్స్‌ చక్కగా పని చేస్తుందన్న ముఖ్యమంత్రి సంస్థ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడితే ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా మరో 7 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.ఇక్కడి సంస్థలో ఇప్పటికే 3 వేల మంది పని చేస్తుండగా, అనుబంధ విభాగాల ద్వారా మరో 3500 మందికి ఉపాధి లభిస్తోందని గుర్తు చేశారు.కియా కంపెనీలో ఇప్పటికే ఏటా 70 వేల వాహనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతుండగా, సంస్థ మరిన్ని ప్లాంట్లు, విభాగాలు ప్రారంభించాలని సీఎం ఆకాంక్షించారు. కియా సంస్థ ఏటా 3 లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి చేరాలన్న ఆయన, తద్వారా ఇంకా ఎందరికో ఉపాధి లభిస్తుందని అన్నారు. కియా మోటర్స్కు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అన్ని విధాలుగా తోడ్పాటు అందించడంతో పాటు కంపెనీకి సానుకూలంగా వ్యవహరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. తమది ప్రొయాక్టివ్ ప్రభుత్వం అని ఆయన వివరించారు.
కియా కార్లకు ఇక్కడ మంచి ఆదరణ ఉందన్న సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ హాన్ఊపాక్, ఒకేరోజు 6 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. భారత్లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంకిన్, కియా మోటర్స్ ఎండీ కోకిన్షిన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  మంత్రులు  బొత్స సత్యనారాయణ,  ఎం.గౌతమ్రెడ్డి,  ఎం.శంకరనారాయణ,  జి.జయరాం, ఎంపీలు  కె.గోరంట్ల మాధవ్,  తలారి రంగయ్య, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కె రోజా, మండలి విప్  కాపు రామచంద్రారెడ్డితో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, కియా మోటర్స్ ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.

Related Posts