YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

90 ఎంఎల్ సినిమాను అడ్డుకుంటాం 

90 ఎంఎల్ సినిమాను అడ్డుకుంటాం 

90 ఎంఎల్ సినిమాను అడ్డుకుంటాం 
హైద్రాబాద్, డిసెంబర్ 5, 
కార్తికేయ హీరోగా నటించిన 90 ఎంఎల్ సినిమాను అడ్డుకుంటామని మద్యపాన నిషేధం పోరాట సమితి సభ్యులు ప్రకటించారు. ఈ సినిమా ప్రదర్శితం కాకుండా శాంతియుతంగా అడ్డుకుంటామని సమితి సభ్యులు తెలిపారు. చిత్ర విడుదల సమయంలో ఐమాక్స్ థియేటర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామని వెల్లడించారు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన 90 ఎంఎల్ చిత్రం డిసెంబరు 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఈ సినిమా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పోరాట సమితి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి చిత్రాల వల్లే యువత పెడదోవ పడుతోందని, మహిళలపై అఘాయిత్యాలకు కూడా ఇదే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం సినిమాలో మద్యం సేవించే సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయని, అలాంటి సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాక చిత్ర పేరును కూడా మార్చాలి అని మద్యపాన నిషేధ పోరాట సమితి సభ్యులు తేల్చి చెప్పారు.కార్తికేయ సొంత బ్యానర్ అయిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలోనే ఈ చిత్రం రూపొందింది. శేఖర్ రెడ్డి ఏర్రా దర్శకత్వం వహించారు. సరస్వతి శుక్ల సమర్పణలో విడుదలవుతున్న ఈ చిత్రానికి అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. 90ఎంఎల్ మద్యం రోజూ తాగకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందనే వినూత్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Related Posts