YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

భవిష్యత్ కోసమే అమరావతి నిర్మాణం

భవిష్యత్ కోసమే అమరావతి నిర్మాణం

భవిష్యత్ కోసమే అమరావతి నిర్మాణం
విజయవాడ, డిసెంబర్ 5  
అమరావతిపై ఏపీలో మళ్లీ రాజకీయ రగడ మొదలయ్యింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు పోటా-పోటీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశాయి. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అమరావతిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తే.. టీడీపీ ఐదేళ్ల పాలనో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా అంటూ అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మాటల యుద్ధం కొనసాగుతుండగానే.. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి అంశంపై స్పందించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కాకూడదు అన్నారు.ప్రజా రాజధానిగా అమరావతిని అద్భుతంగా నిర్మించాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అన్నారు చంద్రబాబు. సంపద సృష్టి, ఉపాధి కల్పన ద్వారా పేదరిక నిర్మూలనకు దోహదపడేలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని వ్యాఖ్యానించారు. #సేవ్ అమరావతి, #సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు ట్వీట్ చేశారు టీడీపీ అధినేత.ప్రజా రాజధానిగా అమరావతిని అద్భుతంగా నిర్మించాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష. సంపద సృష్టి, ఉపాధి కల్పన ద్వారా పేదరిక నిర్మూలనకు దోహదపడేలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మన బిడ్డలు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండరాదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టుబడులు రాబట్టాం. భూములిచ్చిన రైతుల త్యాగాలు వృధా కారాదు, భావి తరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ తపన’అన్నారు చంద్రబాబు.

Related Posts