YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

యూనియన్ నేతల గుట్టు లాగే పనిలో సర్కార్

యూనియన్ నేతల గుట్టు లాగే పనిలో సర్కార్

యూనియన్ నేతల గుట్టు లాగే పనిలో సర్కార్
హైద్రాబాద్, డిసెంబర్ 6,
ఆర్‌టిసి పరిరక్షకులుగా చెప్పుకునే యూనియన్ లీడర్లు ఆర్‌టిసి ప్రైవేటీకరణను వ్యతిరేకించడం వెనుక వారి స్వార్థప్రయోజనాలు ఉన్నాయా..? ఒకవైపు కార్మికులను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉసిగొలుపుతూ మరోవైపు అద్దెబస్సులను బినామీ పేర్లతో నడిపిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న కార్మికనేతలపై ఆర్‌టిసి యాజమాన్యానికి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. రాజిరెడ్డితో సహా మరికొందరు నాయకులు ఆర్‌టిసి సమ్మె సందర్భంగా పలుమార్లు ఆర్‌టిసి ప్రైవేటీకరణను వ్యతిరేకించడం వెనుక కారణాలు ఇవేనా..? అని ఇప్పుడు కా ర్మికులు అంతర్గతంగా చర్చించుకుంటూ యూనియన్‌నేతల ముసుగులో వారు చేస్తున్న అవినీతి,అక్రమాలను మరికొన్నింటిని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్‌టిసిని ప్రైవేటీకరిస్తే తమ అద్దెబస్సుల దందా బంద్ అవుతుందనే భయంతో ఆర్‌టిసి ప్రక్షాళన అడ్డుకుంటున్నారని కొందరు కార్మికులు యాజమాన్యం దృష్టికి తీసుకురావడం సంచలనం సృష్టిస్తున్నది. అయి తే, యాజమాన్యం తీసుకునే చర్యలు కక్షసాధింపు ధోరణిలో కాకుండా సాక్షాల ఆధారంగానే చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నది.సమ్మె ముగిసిన తరువాత యూనియన్ నేతల అక్రమాలు, అవినీతిపై కా ర్మికుల నుంచి ఇ-మెయిల్స్, వాట్సప్ రూపంలో ఫిర్యాదులు వరసగా రావడం యాజమాన్యాన్నే ఆశ్చర్యపరుస్తున్నది.బినామీ బస్సులనే కాకుండా మెడికల్ రిఫరెన్స్‌లోనూ ఎక్కడ అవకాశం చిక్కినా అక్కడ దండుకుంటూ ఇటు ఆర్‌టిసిని అటు కార్మికుల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్న యూనియన్‌నేతల డబుల్ యాక్షన్‌ను నిరూపించే ఆరోపణలు ఆధారాలతో సహా యాజమాన్యానికి అందుతున్నాయి. వీటిని సాకల్యంగా విచారించి ఆధారాలతోనే దానికి బా ధ్యులైన యూనియన్‌నేతలపై యాజమా న్యం చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఆర్‌టిసిలో యూనియన్ బడానాయకులమని చెప్పుకునే పలువురిపై ఆర్‌టిసి యాజమాన్యానికి ఫిర్యాదులు అం దుతున్నాయి. సమ్మె ముగిసిన తరువాత అవి మరింతగా ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటం గమనార్హం.ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శిగా ఉన్న కె.రాజిరెడ్డి తన త మ్ముడు కొమిరెల్లి జగన్‌రెడ్డి ఇతర కుటుంబసభ్యుల పే రుమీద ఐదు బస్సులను అద్దెకు నడుపుతున్నట్లు యాజమాన్యానికి బస్సు నెంబర్లతో సహా ఫిర్యాదులు అందా యి. రాజిరెడ్డి సోదరుడు జగన్‌రెడ్డి పేరుమీద యాదగిరిగుట్ట డిపోలో టిఎస్ 30 టి116, రాజేంద్రనగర్ డిపోలో ఎపి 29 టిఎ 326 6, కోదాడ డిపోలో టిఎస్ 05 యుఎ 2171, జగన్ రెడ్డి భార్య కొమిరెల్లి అనిత పేరు మీద టిఎస్ 07 యుఇ 5369, వరసకు సోదరుడైన కొమిరెల్లి నారాయణరెడ్డి పేరుమీద ఉప్పల్ డిపోలో ఎపి 29 టిఎ 4073 బస్సులను నడుపుతున్నట్లుగా ఫిర్యాదుల్లో విస్పష్టంగా యాజమాన్యానికి వివరాలు అందాయి. మరికొందరు ఆర్‌టిసి నేతలకు కూడా బినామీ అద్దెబస్సులు ఉన్నట్లుగా ఫిర్యాదులు ప్రాథమికంగా అందాయి.మరోవైపు ఆర్‌టిసి కార్మిక నేతలు మెడికల్ రిఫరెన్స్‌లో కూడా అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. అధికారికంగా మెడికల్ రిఫరెన్స్‌లో అందే ప్రయోజనాలే కాకుండా అనధికారికంగా కూడా అనేకమంది బయటవారిని రిఫర్‌చేసి నేతలు కాసులు చేసుకున్నారనే ఫిర్యాదులు కూడా యాజమాన్యానికి అందినట్లు తెలిసింది. తమ పక్షాన యూనియన్‌నేతలు ఇన్నాళ్లూ పాటుపడుతూ ఆర్‌టిసి ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నారని విశ్వసించిన కార్మికులు బహిర్గమవుతున్న ఈ బినామీ బస్సుల దందాతో ముక్కన వేలేసుకుంటున్నారు. తమలాంటి కార్మికులే యూనియన్ నేతలే అయినప్పటికీ ఇంత ఖరీదైన జీవితం ఎలా గడుపుతున్నారో అర్థం కాలేదని, అసలు కథ ఇదా.? అంటూ పలువురు కార్మికులు విస్మయానికి గురవుతున్నారు. యూనియన్ నేతల ముసుగులో ఆర్‌టిసిని ఫణంగా పెట్టి కొందరు ఏ విధంగా లబ్ధిపొందారనే ఫిర్యాదులు వరసగా వస్తుండటంతో యాజమాన్యమే విస్మయానికి గురయ్యే పరిస్థితి తలెత్తింది.

Related Posts