
హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ
అమరావతి డిసెంబర్ 6,
హోంగార్డు రైజింగ్ డే సందర్భంగా హోంగార్డ్సు అందరికీ డీజీపీ గౌతమ్ సవాంగ్ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులతో పాటు సమానంగా హోంగార్డులు విధుల్లో ఎంతో కష్టపడుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హోంగార్డులకు ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిందనిఅన్నారు. పోలీసులతో సమానంగా యాక్సిస్ బ్యాంకు ద్వారా ముప్పై లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ సౌకర్యాన్ని మేము కల్పించాం. హోంగార్డుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పోలీసు శాఖ తరపున అండగా ఉంటామని అయన అన్నారు.