
వెంకటగిరిలో ఆనం సంచలన వ్యాఖ్యాలు
నెల్లూరు డిసెంబర్ 06
వెంకటగిరిలో మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేసారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అనేక మాఫియాలు అడ్డాగా నెల్లూరు పట్టణం మారిందని అన్నారు. ఒక అడుగు ముందుకు వేయాలి అన్నా అధికారులకు వాళ్ళ ఉద్యోగ భద్రత గుర్తొస్తుంది. నెల్లూరు నగరంలో ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా సాండ్ మాఫియా కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు, మీకు ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు పట్టణం ఉందని అన్నారు. ఈ మాఫియా ఆగడాలకు నెల్లూరు పట్టణంలో వేలాది కుటుంబాలు లక్షలాది ప్రజలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఐదు సంవత్సరాలలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరు కి దక్కిందని అయన వ్యాఖ్యానించారు.