
ప్రభుత్వ వైఫల్యాలతోనే ఆత్యాచారాలు
హైదరాబాద్ డిసెంబర్ 7,
98 శాతం అణగారిన కులాల మీద అత్యాచారాలు,హత్యలు జారుగుతున్నాయి. అక్కడక్కడ అగ్ర కులాల మహిళల మీద అత్యాచారాలు,హత్య లు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న హత్యలను,అత్యాచారాలను ఖండిస్తున్నానని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు. శనివారం అయన మీడియతో మాట్లాడారు. భారత మాత కు జై కొట్టే దగ్గర భారత మాత ల మీద హత్యలు అత్యాచారాలు జరగడం బాధాకరం. కుల మతాలకు అతీతంగా మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. కొల్లాపూర్ కు చెందిన వైశ్య అమ్మాయి మీద అత్యాచారం చేశారు. ఆమె మీద అత్యాచారం చేసిన వాళ్ళు తెరాస వాళ్ళు అని తెలిసి వారి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు అత్యాచారం చేసిన వారికి అండగా నిలపడ్డారు. అందుకే నిందితులను అరెస్ట్ చేయలేదు. మా పోరాటం తరువాత నే నిందితులను అరెస్ట్ చేశారని అన్నారు. అసిఫాబాద్ టేకు లక్ష్మీ, వరంగల్ మానస, ప్రియాంక రెడ్డి ఈ మూడు కుటుంబాలను నేను పరామర్శించాను. ప్రభుత్వం వైఫల్యం వలనే ఈ ముగ్గురి పై అత్యాచారం జరిగింది. కులాలు మతాలకు అతీతంగా మేము స్పందించాం. ఏపార్టీ లు మాట్లాడలేదు. నివాళి అర్పించలేదు. కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలు కూడా నివాళి అర్పించాలి. అగ్రకుల మహిళలకు ఏమైనా జరిగితే రాజకీయ పార్టీలు,ప్రభుత్వాలు స్పందిస్తాయి.కానీ ఎస్సీ, ఎస్టీ బీసీ ల మీద హత్యలు అత్యాచారాలు జరిగితే ఎవరు స్పందించరని అయన విమర్శించారు. నిర్భయ, ప్రియాంక రెడ్డి ఇద్దరు చనిపోయిన తరువాత ఇద్దరు అగ్రకులం వాళ్ళు అని తెలిసింది. నిందితులను ఉరి తీయాలని కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేసారు. ఉరి తీయాలో ఎన్ కౌంటర్ చేయాలో వీళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి. చట్టం చూసుకుంటుంది కదా. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటి ఘటనలు జరిగినపుడుఎక్కడికి వెళ్లిన ఉరి తీయాలని, రాళ్లతో కొట్టి చంపాలని,ఎన్ కౌంటర్ చేయాలని నేను ఎప్పుడు అనలేదని అయన అన్నారు. హత్యలను సమర్దించను. ఆత్మహత్యలను సమర్దించను. చట్ట పరమైన చర్యలు మాత్రమే తీసుకోవాలని కోరుకుంటాను. గాంధీ ని చంపిన గాడ్సే ను కూడా చట్ట పరంగా ఉరి శిక్ష వేశారు. జీవించే హక్కుకు ఎవరికి భంగం కలగవద్దు. న్యాయ వ్యవస్థ కూడా తొందరగా తీర్పు ఇవ్వాలి. ప్రియాంక రెడ్డి ని చంపిన వాళ్ళను చంపాలన్నారు. అగ్రకుల మహిళ ల మీద హత్య ,అత్యాచారం జరిగినపుడు వాళ్ళ పేరు మారుతుంది ఎందుకు అంటే వాళ్ళ ఇద్దరి మీదనే జరిగింది కాబట్టి వాళ్ళ పేరు మార్చారు..98 శాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ ల మీద హత్యలు, అత్యాచారాలు రోజు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు పేరు మార్చడం లేదు..వాళ్ళ గురించి ఎవరు మాట్లాడడం లేదని విమర్శించారు. నిర్భయ చట్టం వచ్చిన తరువాత నిర్భయ ను అత్యాచారం చేసిన వాళ్ళను అరెస్ట్ చేసి ఉరి శిక్ష వేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ ల మీద అత్యాచారం చేసిన వాళ్ళు బయట ఎంజాయ్ గా తిరుగుతున్నారు.
ప్రియాంక రెడ్డి ఘటన లో నిందితులపై గతంలో ఎలాంటి కేస్ లు లేవు..కానీ హజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో హత్య కేస్ ఉంది ఎందుకు హజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అయన ప్రశ్నించారు. ప్రియాంక రెడ్డి కోసం నలుగురిని చంపమని కోరిన కిషన్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి..హజీపూర్ లో నలుగురిని చంపిన శ్రీనివాస్ రెడ్డి ని ఎందుకు చంపమని కోరుకోలేదని అయన అడిగారు. హజీపూర్ లో శ్రీనివాస్ రెడ్డి పై చర్యలు తీసుకోమని మీరు అప్పుడు డిమాండ్ చేస్తే ఇప్పుడు ప్రియాంక రెడ్డి బ్రతికేది. హజీపూర్ లో చంప బడ్డ వాళ్ళు వాళ్ళ కులం కాదు కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడరు. నిందితులు రెడ్లు కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడరు. హజీపూర్ లో వాళ్ళు బలహీన వర్గాల వారని తెలిసి వారిని హత్యాచారం చేసి శ్రీనివాస్ రెడ్డి చంపాడు. హైదరాబాద్ లోనే రక్షణ లేకపోతే అడవులలో ఉన్న వాళ్లకు ఎలా రక్షణ ఉంటుందని అయన అన్నారు. వారంలో మూడు హత్య చారాలు, హత్యలు జరిగితే మహిళ కమిషన్ ఎందుకు మాట్లాడలేదు. కిషన్ రెడ్డి హోమ్ మంత్రి గా ఉన్నప్పుడు టేకు లక్ష్మీ, మానస,ల మీద ఆత్యాచారాలు జరిగాయి మీరు ఎందుకు ఆ కుటుంబాలను పరామర్శించలేదు. గవర్నర్ దృష్టి కి ఈ సంఘటనలు తీసుకు వెలుతామని అయన అన్నారు. ప్రియాంక రెడ్డి కి ఆత్మ శాంతి కలిగినపుడు టేకు లక్ష్మీ, మానస, హజీపూర్ లో చంప బడ్డ వారికి కూడా ఆత్మ శాంతి కలగాలి కదా. మానస, టేకు లక్ష్మీ, హజీపూర్ బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని మేము వారికి క్షమాపణ చెపుతాం. గవర్నర్ కూడా మహిళనే కదా ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళింది కానీ మానస, టేకు లక్ష్మీ ఇంటికి వెళ్లలేదు. ఎందుకు ఇంత వివక్ష అని ప్రశ్నించారు. ఈ ఘటనలపై డీజీపీ కి,గవర్నర్ దృష్టి కి తీసుకువెళుతం. ప్రియాంక రెడ్డి కంటే ముందు జరిగిన వాటి మీద కూడా ఇలానే స్పందిస్తే బాగుండేదని మంద కృష్ణ అన్నారు.