
ఐదునెలల్లో రెండుసార్లు ఏసీబీ దాడులు
నంద్యాల డిసెంబర 07
శనివారం నాడు నంద్యాల లో ఎసిబి అధికారులు ఆర్టీవో ఆఫీస్ పై .దాడులు చేశారు. . జులై 10 న లైసెన్స్ వివరాల కోసం 40 వేలు లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. డిసెంబర్ 7 న రెండవసారి 8 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ రెండు సార్లు చేసిన దాడుల్లో పట్టుబడ్డ నరసింహ. లంచం లేనిదే ఆర్టీఓ కార్యాలయంలో ఫైల్స్ కదలని పరిస్థితి వుంది. కర్నూల్ జిల్లా లోని అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరగెత్తిస్తుంది. ఏసీబీ డీఎస్పీ ని నంద్యాల ప్రజలు అభినందిస్తున్నారు. నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ దాడులతో మిగతా ఏజంట్లు పరుగులు లంకించుకున్నారు. ఆర్టీఓ కార్యాలయం చుట్టుపక్కల ఏజంట్ల బంకులు వున్నాయి. ఏజెంట్ కోడ్ ఉంటేనే లైసెన్స్ అయిన రెన్యువలైన ఒకే అవుతుందని వాహన దారులు అంటున్నారు. ప్రతి పనికి రేట్ ఫిక్స్ చేసిన ఏజెంట్స్, అధికారులతో కుమ్మక్కైయ్యారని ఆరోపిస్తున్నారు