
లక్ష్మిబాయిని అత్యాచారం చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలి
ఆదివాసీ, దళిత, మైనారిటీ, విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ
కొమురంభీం ఆసిఫాబాద్
చెంచు మహిళ టేకు లక్ష్మిని అత్యాచారం, హత్య చేసిన నిందితులను కూడా ఎకౌంటర్ చెయ్యాలని ఆదివాసీ, దళిత, మైనారిటీ, విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేశాయి. దీంతోపాటు జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యూ ప్రాంతాల్లో సంపూర్ణ బంద్‌ను చేపట్టారు. టేకు లక్ష్మిబాయిని అత్యాచారం చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని జైనూర్‌లో రాస్తారోకో చేశారు. అన్ని సంఘాల నాయకులు ర్యాలీ చేస్తూ.. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. జైనూర్‌లోని మార్కెట్‌లో కూడా బంద్‌ను నిర్వహించారు.