YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు

గంటకు 30,625 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది!

గంటకు 30,625 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది!

ఉరుకులు… పరుగుల జీవితమిది… కుటుంబంతో గడిపే సమయం కూడా తగ్గిపోతోంది… చివరకు ఏదైన శుభకార్యాలు జరగినా అలా టైంకి వెళ్లడం తిరిగి రావడం ఇలా తయారైంది పరిస్థితి. ఇక దీనికి తోడు వెగంగా వెళ్లే, శక్తివంతమైన ఇంజిన్‌ కలిగిన వాహనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. బైక్, కారు, బస్సు, ట్రైన్, బుల్లెట్ ట్రైన్, హెలికాప్టర్లు, విమానాల వేగాల్లో మార్పులు వస్తున్నాయి. ఈ వేగం ఇప్పుడు ఎంత వరకు వెళ్లిందంటే గంటకు ఏకంగా 30,625 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే పరిస్థితికి. ఇది ఊహకందని స్పీడు… కానీ, ఇది త్వరలోనే సాధ్యం కాబోతుందట.
ఇలాంటి విమానాన్నే చైనా అభివృద్ధి చేస్తోంది… ఈ విమానం బీజింగ్‌ నుంచి న్యూయార్క్‌కు కేవలం 2 గంటల్లోనే చేరుకోగలదు. ఈ విమానాన్ని పరీక్షించేందుకు ధ్వని వాయు సొరంగం (హైపర్‌సోనిక్‌ విండ్‌ టన్నెల్‌)ను చైనా నిర్మిస్తోందట. కొత్తగా తయారైన వాహనాలు, విమానాలు దూసుకెళ్లేటప్పుడు వీచే గాలి ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించడానికి ఏరోడైనమిక్స్‌ పరిశోధనల్లో వాయు సొరంగాలను ఉపయోగిస్తారన్నమాట. డ్రాగన్ కంట్రీ అభివృద్ధి చేస్తున్న కొత్త విమానం వేగం… ధ్వని వేగానికి 25 రెట్ల అధికంగా ఉండనుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే గంటకు ఏకంగా 30,625 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకుపోగలదన్నమాట. అయితే ఇంత వేగంగా దూసుకెళ్తున్న విమానంపై గాలి ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది… ఆ పరిస్థితిని కృత్రిమంగా వాయుసొరంగంలో కల్పించి విమానాన్ని మొదట పరీక్షిస్తారు. దీని కోసమే చైనా ఇప్పుడు 265 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మిస్తోందని ఆ దేశ మీడియా కథనం.

Related Posts