YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నీటి పారుదల, పరిశ్రమల రంగానికి అత్యధిక ప్రాధాన్యం : డా.ఎస్.కె.జోషి

నీటి పారుదల, పరిశ్రమల రంగానికి అత్యధిక ప్రాధాన్యం : డా.ఎస్.కె.జోషి

దేశంలో నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, నీటి పారుదల, పరిశ్రమల రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి వివరించారు. గురువారం సచివాలయంలో మేజర్ జనరల్ హర్ కిరత్ సింగ్ నేతృత్వంలో నేషనల్ డిఫిన్స్ కాలేజి సభ్యులు Economic Security Study Tour లో భాగంగా సి.యస్ ను కలిసారు. ఇరిగేషన్ రంగానికి బడ్జెట్ లో 25 వేల కోట్లు కేటాయించామని, కోటి ఎకరాలకు  సాగు నీరందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, మిషన్ కాకతీయ ద్వారా 45000 చెరువుల మరమ్మతులు చేపట్టి చిన్ననీటి వనరుల పునరుద్దరించి  గ్రామలలో నీటి భద్రతను కల్పించనున్నట్లు వారికి తెలిపారు. హైదరాబాదు నగరం నాలుగు వైపుల విస్తరిస్తున్నదని పారిశ్రామికంగా అనేక మంది పరిశ్రమల స్ధాపనకు ముందుకు వస్తున్నారని సి.యస్ వారికి వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 7600 MW స్ధాపిత సామర్ధ్యం ఉంటే నేడు 14 వేల మెగా వాట్లకు పైగా చేరుకున్నదని, 24X7 విద్యుత్ ను అందిస్తున్నామని, పవర్ హాలిడేలు లేవని సి.యస్ తెలిపారు. ఇరిగేషన్ ప్రాజేక్టుల నిర్మాణం సందర్భంగా R&R ప్యాకెజికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. మేజర్, మీడియం ఇరిగేషన్ తో పాటు మైక్రో ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. హైదరాబాదు నగరం భిన్న సంస్కృతులకు నిలయమని మంచి రోడ్లు, తగు భద్రత, మంచినీరు, నిరంతర విద్యుత్ సదుపాయాలు  మెరుగైన జీవనానికి అనువైన నగరంగా రూపుదిద్దుకున్నదని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. NDC బృందం హైదరాబాదుకు రావడం హర్షణీయమని తెలుపుతూ వారితో వివిధ విషయాలపై చర్చించారు. NDC బృందం తమ రెండురోజుల పర్యటనలో NFC, ISB, Microsoft, Tata, Boeing JV లను సందర్శించనున్నట్లు సి.యస్ కు తెలిపారు.
------------------------------------------------------------------------------------------------------------------------------------------
జారీ చేసినవారు,కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Related Posts