YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

జనరల్ నాల్డెజీ..

Highlights

రాష్ట్రీయం

జాతీయం

అంతర్జాతీయం

జనరల్ నాల్డెజీ..

రాష్ట్రీయం..

1). రాష్ట్రంలో గీత కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంత మొత్తం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది ?

జ: రూ.500 కోట్లు

2). తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ చనిపోయే గీత కార్మికుల కుటుంబాలకు ఎంత మొత్తం ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం చెల్లిస్తోంది ?

జ: రూ.5 లక్షలు

3). హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ?

జ: అంజనీ కుమార్

4). అసెంబ్లీలో జరిగిన గొడవ సందర్భంగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఆ రెండు నియోజకవర్గాలు ఏవి ?

జ: నల్గొండ, ఆలంపూర్

జాతీయం..

5). భారత సైన్స్ కాంగ్రెస్ 105వ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరగనుంది ?

 జ: మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ లోని మణిపూర్ విశ్వవిద్యాలయంలో

6). ప్రజా పద్దుల సంఘం (పీఎసీ) ఛైర్మన్ గా ఎవరు కొనసాగనున్నారు ?

జ: మల్లి ఖార్జున్ ఖర్గే

7). దేశంలోనే సంపన్న ఎంపీగా ఎవరు నిలిచారు ? జ: జయాబచ్చన్

8). క్షయ రహిత భారత్ కార్యక్రమాన్ని ఎప్పటి లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?

జ: 2025 కు

9). జీఎస్ఎల్ఎఫ్ ఎఫ్08 ను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎప్పుడు ప్రయోగించడానికి ఇస్రో ఏర్పాట్లు చేసింది ?

జ: మార్చి 29న

10). 2018లో ఊహించిన దానికన్నా ఎక్కువగానే భారత్ వృద్ధి రేటు ఉండే అవకాశం ఉందని డెలాయిట్ అంచనా వేసింది. ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక పేరేంటి ?

జ: వాయిస్ ఆఫ్ ఆసియా

11). దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించిన టాప్ 3 సంస్థలుగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి ?

జ: ఇండియన్ ఆయిల్, ఒఎన్జీసీ, కోల్ ఇండియా

12). భారీ నష్టాలు మూటగట్టుకున్న PSUల్లో ఏవి ఉన్నాయి ? జ: ఎయిరిండియా

13). దేశంలో ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వాడుతున్న నగరాల్లో వేగవంతమైన నెట్ స్పీడ్ లభిస్తున్న నగరంగా ఏది ప్రథమ స్థానంలో నిలిచింది ?

జ: చెన్నై 14).

ఇంటర్నెట్ వేగం

లో హైదరాబాద్ ఎన్నో స్థానంలో నిలిచింది ?

జ: 3వ స్థానం *అంతర్జాతీయం*

15).119 యేళ్ళ చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభమవుతుంది ?

జ: బర్మింగ్ హామ్

16). ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్షిప్ లో ఇప్పటి దాకా ఇద్దరు భారతీయ క్రీడాకారులు మాత్రమే విజేతలుగా నిలిచారు. వాళ్ళెవరు ?

జ: ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్

17). 2018 సంవత్సరానికి అంతర్జాతీయ వృద్ధి రేటు ఎంతగా నమోదయ్యే అవకాశం ఉందని డెలాయిట్ అంచనా వేసింది ? జ: 3.7

18). అమెరికా విదేశాంగ మంత్రిగా టిల్లర్ సన్ ను తొలగించారు. ఆయన స్థానంలో ఎవర్ని ప్రెసిడెంట్ ట్రంప్ నియమించారు ? జ: మైక్ పాంపియో

19) ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్తగా ఎవరు నియమితులయ్యారు ? జ: అరవింద్ సుబ్రమణియన్

Related Posts