YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయని రేవంత్ !!

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయని రేవంత్ !!

రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును  వినియోగించుకోలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రెండు ఓట్లు రద్దు అయ్యాయి. అధికార పార్టీ వేసిన స్కెచ్ కారణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఇద్దరి ఓట్లు కాంగ్రెస్ కు లేకుండా పోయాయి. దీంతోపాటు ఓటు హక్కు కలిగిన  రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈ విషయంలో ఆయన ఎందుకు ఓటు హక్కును వినియోగించుకోలేదన్నదానిపై సర్వత్రా చర్చ సాగుతున్నది. ఒకవైపు పార్టీ కాంగ్రెస్, టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలంతా పోటీ పడి ఓటు హక్కు వినియోగించుకుంటుండగా... రేవంత్ మాత్రం ఓటు హక్కు వినియోగించుకోకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ మారినంతమాత్రాన ఓటు వేస్తే ఏం పొయింది అని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.దీనిపై రేవంత్ ఏమంటున్నారంటే.. ''నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా.., అందుకే ఓటు హక్కు వినియోగించుకోట్లేదు'' అని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరకముందే తాను తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పుకుంటున్నారు. ఆ రాజీనామాను కూడా టిడిపి అధినేత చంద్రబాబుకు అమరావతిలో సమర్పించారు. అది వివాదాస్పదమైనప్పటికీ రేవంత్ మాత్రం తనకు తాను మాజీ ఎమ్మెల్యేను అన్న భావనలోనే ఉన్నారు. ఇదిలా ఉండగా..రాజ్యసభ ఎన్నికల్లో తొలుత కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలన్న ఆసక్తి చూపలేదు. కానీ.. రేవంత్ రెడ్డి పార్టీపై వత్తిడి తెచ్చి పోటీకి దింపినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతగా పోటీ చేయాల్సిందే అని పార్టీని వత్తిడి చేసి మరీ అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలబెట్టడంలో రేవంత్  క్రియాశీల పాత్రను  పోషించారు. ఈ క్రమంలో బలరాం నాయక్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో కూడా అయన పాల్గొన్నారు. అంతే కాకుండా శుక్రవారం ఎన్నికల సమయంలో  రేవంత్ ఉదయం నుంచీ అసెంబ్లీలోనే  ఉండి కూడా ఓటు వేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓటు వేయకుండా తన నియోజకవర్గం కొడంగల్ లో మాత్రం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతవరకు సమంజసమని టిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Related Posts