YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం కళలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు జిల్లాలోని బెలూం గుహల ఉత్సవాలు..

కర్నూలు జిల్లాలోని బెలూం గుహల ఉత్సవాలు..

కర్నూలు జిల్లాలోని బెలూం గుహల ఉత్సవాలు..
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కర్నూలు జిల్లాలోని బెలూమ్ గుహల్లో ఉత్సవాలు నిర్వహిస్తోంది. డిసెంబర్ 21, 22 తేదీల్లో 'బెలూమ్ కేవ్స్ ఫెస్టివల్' నిర్వహించనుంది. బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహలకన్నా పొడవైనవి. బెలూం గుహల ప్రాముఖ్యతను చాటేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు జిల్లా అధికారులు రోడ్లు రిపేర్లు చేయించడంతో పాటు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. బుద్ధుడి విగ్రహం దగ్గర మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. బెలూం గుహల గురించి వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాలన్న ఉద్దేశం ఈ ఉత్సవాల లక్ష్యం. బెలూమ్ కేవ్స్ ఫెస్టివల్ కోసం చేసే ఏర్పాట్లు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఉండేటట్టు చూస్తున్నారు. అతిపెద్ద ఫుడ్ కోర్టుతో పాటు 10 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. జయింట్ వీల్స్, ఇండోర్ గేమ్స్, ఔట్‌డోర్ గేమ్స్ కూడా పర్యాటకులను అలరించనున్నాయి. సుమారు రూ.50 లక్షల ఖర్చుతో 'బెలూమ్ కేవ్స్ ఫెస్టివల్' నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం.

Related Posts