YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

వాయిదా పడిన చంద్రయాన్ -2 ప్రయోగం

Highlights

  • సాంకేతిక కారణాల రీత్యానే
  • కొన్ని మార్పులను సూచించిన   నిపుణులు
  • అక్టోబర్ లో ప్రయోగిస్తాం 
  • ఈ నెల 29న జీశాట్ -6 ఏ ఉపగ్రహ ప్రయోగం
  •  ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్
వాయిదా పడిన చంద్రయాన్ -2 ప్రయోగం

వచ్చే నెలలో నిర్వహించాల్సిన చంద్రయాన్ -2 ప్రయోగాన్ని వాయిదా వేసినట్టు  భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని సాంకేతిక కారణాల రీత్యా వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. నిపుణులు కొన్ని మార్పులను సూచించారని చెప్పారు. చంద్రయాన్ -2 ప్రయోగం అక్టోబర్ లో ఉంటుందని తెలిపారు. కాగా రూ.800 కోట్ల వ్యయంతో  చంద్రుడిపై మరిన్ని పరిశోధనల నిమిత్తం చేపట్టనున్న ఈ ప్రయోగంలో జీఎస్ లీవీ ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను చంద్రుడిపైకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి పూర్తిగా  దేశీయ పరిఙ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా  జాలర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించనున్న మొబైల్ యాప్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తవుతాయని, ఏప్రిల్ నుండి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 29న జీశాట్ -6 ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇస్రో సమాయత్తమవుతోంది. జీఎస్ ఎల్ వీ-ఎఫ్ 08 ద్వారా దీనిని ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండో లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. 

Related Posts