YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

6 నెలలు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

6 నెలలు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆరు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు తెలిపారు హైదరాబాద్ సీపీ వీవీ శ్రీనివాసరావు. జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 45లో శ్రీహరి ఇంటి నుంచి దుర్గం చెరువు వరకు నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తుండడంతో.. ఆ రూట్‌లో వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆంక్షలు జనవరి 10 నుంచి జూలై 9వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.
మాదాపూర్ నుంచి రోడ్డు జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోకి వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వెహికల్స్ రోడ్డు నెం. 44 మీదుగా NOC పబ్, ఇక్బాల్యా ఇంటర్‌నేషనల్ స్కూల్, ఫెర్నాండేజ్ దవాఖానా, రోడ్డు నెం. 39/44 జంక్షన్ మీదుగా రోడ్డు నెం.45లోకి ఎంటర్ కావాలి. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలన్నారు.

రోడ్ నెం.1/12లో - 15 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
. రోడ్డు నెం.12లోని 1/12 జంక్షన్ నుంచి హిందు శ్మశాన వాటిక వరకు ఎం-40 గ్రేడ్ సీసీ రోడ్డు, ఫుట్‌పాత్ తదితర పనుల కారణంగా 15 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆంక్షలు జనవరి 11 నుంచి 26వ తేదీ వరకు అమలులో ఉంటాయి.
. మాసబ్‌ట్యాంక్ నుంచి రోడ్ నెం. 12కు వెళ్లే వాహనాలను 1/12 జంక్షన్‌లో మళ్లిస్తారు. ఈ వాహనాలు 1/10 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 10, జహీరానగర్, క్యాన్సర్ ఆస్పత్రి, ఒడిశా ఐలాండ్ జంక్షన్ మీదుగా రోడ్ నెం.12లోకి వస్తారు.
. బంజారాహిల్స్ రోడ్ నెం.13లో వన్‌వేను ఏర్పాటు చేస్తున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి రోడ్డు నెం.1లోకి వన్‌వే ఉంటుంది. రోడ్డు నెం.1/12 జంక్షన్ నుంచి రోడ్డు నెం. 13 వాహన అనుమతి ఉండదు. ఈ రూట్‌లోని వాహనాలను రోడ్డు నెం.1/10 జంక్షన్, రోడ్డు నెం.10, జహీరానగర్, క్యాన్సర్ దవాఖానా, ఒడిశా ఐలాండ్ జంక్షన్, రోడ్డు నెం.12కు మళ్లిస్తారు.
. రోడ్డు నెం.45, ఫిలింనగర్, అపోలో ఆస్పత్రి నుంచి రోడ్ నెం.12 మీదుగా వచ్చేవి ఒడిశా ఐలాండ్ జంక్షన్, క్యాన్సర్ ఆస్పత్రి, జహీరానగర్, రోడ్డు నెం.10, రోడ్డు నెం. 1/10 జంక్షన్ నుంచి రోడ్డు నెం.1లోకి వెళ్లాలి.
. ACB అఫీస్ పరిసర ప్రాంతాల నుంచి రోడ్డు నెం.1/12 జంక్షన్‌కు వచ్చేవి రోడ్డు నెం.13 బంజారాహిల్స్ రోడ్డు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.

Related Posts