YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీకాళహస్తితో మహిళల ర్యాలీ

శ్రీకాళహస్తితో మహిళల ర్యాలీ

శ్రీకాళహస్తితో మహిళల ర్యాలీ
శ్రీకాళహస్తి డిసెంబర్ 21
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం ప్రవేశ పెట్టిన దిశా చట్టాన్ని హర్షిస్థూ  శ్రీకాళహస్తిలోని మహిళలు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం నుండి ఈర్యాలీని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మహిళలపై అత్యాచారాల కు పాల్పడేవారిపై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీసుకు వచ్చిన దిశా చట్టాన్ని హర్శిస్తూ శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు.శాసనసభ్యులు బియ్యపు మదుసూధన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో 2000మంది  విద్యార్థులు, మహిళలు అంగన్ వాడి సిబ్బంది పాల్గొన్నారు. రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కేకును కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం పట్టణ పురవీధుల్లో దిశ చట్టాన్ని హరిస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా 14రోజుల్లో విచారణ 21రోజుల్లో శిక్ష విధించే చట్టం తీసుకు రావడంతో మహిళలకు రక్షణ కల్పించే విదంగా ఎంతో  దోహదపడుతుందన్నారు. మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్టగా దిశా  చట్టం ఉంటుందన్నారు.పవిత్రరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి జన్మదినం రోజు మహిళలుకు ఇచ్చిన కానుక ఈదిశ చట్టం  అన్నారు.మహిళా లోకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వరం అన్నారు.ఈ ర్యాలీలో స్థానిక వైకాపా నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Related Posts