
త్రిపుర శాసనసభ మొట్ట మొదటిసారిగా జాతీయ గీతాన్ని ఆలపించింది. 25 ఏళ్ళుగా సిపిఐ(ఎం) పాలించింది. ఆ పార్టీ హయాంలో ఏనాడూ అసెంబ్లీలో భారతదేశ జాతీయ గీతం ఆలపించకపోవడం గమనార్హం.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిలకల్లో ఆ పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారపగ్గాలు చేపట్టింది. ఈ పరిమాణాల క్రమంలో సుదీర్ఘకాలం తర్వాత త్రిపుర అసెంబ్లీ జాతీయ గీతాన్ని ఆలపించింది.