YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆస్తి-పాస్తులు తెలంగాణ

 ప్రాపర్టీ మార్కెట్ కు తగ్గని క్రేజ్

 ప్రాపర్టీ మార్కెట్ కు తగ్గని క్రేజ్

 ప్రాపర్టీ మార్కెట్ కు తగ్గని క్రేజ్
హైద్రాబాద్, డిసెంబర్ 24, 
కనామిక్ స్లో డౌన్ వల్ల దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంటే హైదరాబాద్ లో మాత్రం పెద్దగా ప్రభావం లేదు. ఏటా ప్రాపర్టీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2019– 2020  ఆర్థిక సంవత్సరంలో మన సిటీలో ప్రాపర్టీ రేట్లు 17 శాతం మేర పెరిగాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి  నుంచి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తూనే ఉంది. రెసిడెన్షియల్ తోపాటు కమర్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ లో కమర్షియల్ లీజింగ్ 40 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగుల నుంచి 90 లక్షల చదరపు అడుగుల వరకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో  ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మెరుగు పడటం, వర్కింగ్ ప్రొఫెషనల్స్ సంఖ్య పెరగడంతో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటోంది.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్ కు పెద్ద పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయి. దీంతో ప్రాపర్టీ మార్కెట్ లో డిమాండ్ పెరిగింది.  పెద్దసంఖ్యలో స్టార్టప్ లు, గ్లోబల్ ఫర్మ్స్ తరలివస్తున్నాయి. గత నెల అమెజాన్ సంస్థ యూఎస్ తర్వాత  హైదరాబాద్ లోపెద్ద క్యాంపస్ ను ప్రారంభించింది. హైటెక్ సిటీ దగ్గరలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 9.5 ఎకరాల్లో క్యాంపస్ నిర్మించింది. ఇటీవల ఇంటెల్  సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లోనే ఓపెన్ చేసింది. షూర్ సాఫ్ట్ వేర్ సంస్థ కూడా హైదరాబాద్ లో ఆఫీసు తెరిచింది.హైదరాబాద్ సిటీలోని ఐటీ సెజ్ వేవ్ రాక్ ను రూ.1800 కోట్లతో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అలయన్జ్ గ్రూప్ తో కలిసి కొనుగోలు చేసింది. 25 లక్షల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న వేవ్ రాక్ లో అనేక కంపెనీలు కొలువుదీరి ఉన్నాయి. వేవ్ రాక్ లో అద్దె మీదనే రూ.145 కోట్లు వస్తాయి.

Related Posts