Highlights
- ఢిల్లీలోని తెలంగాణ మీడియాకు మెరుగైన సౌకర్యాలు
- సంస్కరణల దిశగా కేసీఆర్ సర్కారు

ఢిల్లీలోని తెలంగాణ భవన్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది.విభజన తర్వాత తెలంగాణభవన్‌కు ప్రభుత్వం మరమ్మతులు చేపట్టి, అన్ని వసతులు కల్పించింది. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా, కళలకు ప్రాధాన్యం ఇస్తూ రిసెప్షన్ లాబీతోపాటు భవన్‌లోని పలు కార్యాలయాలు, గదులను సిద్ధంచేయించింది.
భవన్‌లోకి స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన నిలువెత్తు తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు రాష్ట్రానికి వన్నె తెచ్చిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హరితహారం పథకం ప్రతిబింబించేలా భారీగా నాటిన మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో గుర్తింపుపొందిన పూలమొక్కలన్నీ అక్కడే దర్శనమిస్తున్నాయి. వీటి పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. తెలంగాణ విశిష్టతను చాటేలా చేనేత కళారూపాలతో హస్తకళాచిత్రాలను, బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటుచేయడంతో తెలంగాణభవన్ కొత్త శోభను సంతరించుకున్నది. ఫిష్ అక్వేరియం, రిసెప్షన్, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్‌తోపాటు పలు హంగులు కల్పించారు.
గతంలో భవన్‌లో కొంతభాగం ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు ఎదురుకొన్న సందర్భాలు.
ఇదే విధంగా ఢిల్లీలోని తెలంగాణ మీడియాకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.