YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

 ముందుకుసాగని డంపింగ్ వ్యవహారం

 ముందుకుసాగని డంపింగ్ వ్యవహారం

 ముందుకుసాగని డంపింగ్ వ్యవహారం
మెదక్, డిసెంబర్ 26,
రెండేళ్లుగా వేధిస్తున్న  జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ డంప్‌యార్డ్ నిర్మాణం కథ.. ఎంతకీ సుఖాంతం కాకపోవడంతో చెత్తసేకరణకు ఆటంకం ఏర్పడింది. ఈ చెత్త కంపు మేం భరించలేం. చావనైనా చస్తాం కాని..ఇక్కడ చెత్తదిబ్బ నిర్మాణానికి మేం ఒప్పుకోం. చెత్తదిబ్బను తెచ్చి.. మా గ్రామాన్ని బొందల గడ్డగా మార్చకండి అంటూ సంగారెడ్డి నియోజకవర్గ పరిది శివారు గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు.ఏరిన చెత్తను ఎక్కడ కుప్ప పోయాలో తెలియకు పారిశుద్ద  కార్మికులు సైతం చెత్తసేకరణకు విముఖత చూపడంతో జిల్లా కేంద్రంలోని వీధులన్నీ చెత్తదిబ్బలుగా మారి... దుర్వాసనతో ముక్కుపుటాలు ఎగిరిపోతున్నాయి. భరించలేని దుర్వాసనతో పట్టణ ప్రజలు సతమతమవుతూ అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కంది మండలంలోని చెర్యాలలో స్థలంకేటాయించడం... అక్కడి ప్రజలు వ్యతిరేకిం చడంతో  వెనక కు తగ్గడం.. ఆరుట్ల గ్రామ శివారులోని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డంప్‌యార్డ్‌ను కూడా ఇక్కడి ప్రజలు అడ్డుకోవడంతో చెత్త సేకరణ విధులకు తీవ్ర ఆటంకం కలిగింది. శివారు గ్రామాలలో చెత్త దిబ్బ ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు నిర్మాణాత్మకమైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్ 1 పురపాలక సంఘంలో తీవ్ర సమస్యగా మారిన డంపిం గ్‌యార్డ్ వ్యవహారం ఎక్కడవేసిన గొగ్గడి అక్కడే అన్న చందంగా మారింది. ఆరు నెలలుగా సాఫీగా సాగిన చెత్త సేకరణ అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్య వైఖరి కిరణంగా వారం రోజులుగా చెత్త సేకరణ నిలిచిపోయింది. సంగారెడ్డి మండలం ఆరుట్ల గ్రామ శివారు లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డంప్‌యార్డ్‌కు  పట్టణంలో సేకరించిన ఆరు నెలలుగా తరలించారు. జిల్లా కేంద్రంలో సేకరించిన చెత్తను డంప్ చేసేందుకు చెర్యాల గ్రామ శివారులో డంప్‌యార్డును నిర్మించ తలపెట్టారు. అయితే గ్రామంలో డంప్ యార్డు నిర్మించవద్దంటూ గ్రామస్తుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో అధికారులు వెనక్కి తగ్గి నిర్మాణం పనులను నిలిపి వేశారు. సంగారెడ్డి మండలంలోని ఆరుట్ల గ్రామ శివారులో ఆరు నెలల పాటు చెత్తను డంప్ చేయడంతో ఆ గ్రామస్తులు వారం రోజులుగా అడ్డుకుంటున్నారు.జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో వారం రోజులుగా చెత్త సేకరణ నిలిచిపోయింది.  కాలనీల్లో చెత్తకుప్పలు పేరుకుపోయి ముక్కుపుటాలదిరేలా దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణంలో 31 వార్డులుండగా, కొత్త కాలనీ లతో కలుపుకొని 40కి పైగా కాలనీలున్నాయి. 18 వేలకు పైగా నివాస ఇళ్లు ఉండగా, 90 వేల జనాభా కలిగిన జిల్లా కేంద్రంలో రోజుకు 40వేల నుంచి 50వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తుంటారు. ఈ లెక్కన నెల రోజులుగా చెత్త సేకరణ నిలిచిపోవడంతో పట్టణంలో 15లక్షల  మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయినట్లు సమాచారం.

Related Posts