YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు కళలు తెలంగాణ

 కూచిపూడిలో రాణిస్తున్న వేణుగోపాల్ నిజామాబాద్,

 కూచిపూడిలో రాణిస్తున్న వేణుగోపాల్ నిజామాబాద్,

 కూచిపూడిలో రాణిస్తున్న వేణుగోపాల్
నిజామాబాద్, డిసెంబర్ 26,
ఆ యువకుడిది పేద కుటుంబం సమాజం లో ఏదో ఒక రంగంలో రాణించి గుర్తింపు పొందాలని ఆశయం నాట్యమే ప్రాణంగా జీవితమే నాట్యం గా కూచిపూడిలో శిక్షణ పొందారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి కళారంగంలో పేరుగాంచారు. కళకు మరింత గుర్తింపు తీసుకు రావాలన్న ఆశయంతో గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు కోసం 13 గంటల విరామం లేకుండా కూచిపూడి నృత్యం చేసి గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ కు చెందిన వేణు గోపాల్ చిన్న తనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మురళీధర్ జయశ్రీ దంపతులు వేణుగోపాల్ ను దత్తత తీసుకొని పెంచారు. అయితే వేణుగోపాల్  పేద బ్రాహ్మణ కుటుంబం కావడంతో వరంగల్ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. పేదరికం వెంటాడిన కల పై తనకున్న మమకారంతో కూచిపూడిలో రాణిస్తున్నారు. 12 ఏళ్ల ప్రాయంలోనే కూచిపూడి నాట్యంలో డిప్లమా సాధించారు. బాల్కొండలో అమృతధార సేవా సంస్థ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామి మందిరం వద్ద 13 గంటల పాటు విరామం లేకుండా నృత్య ప్రదర్శన చేశారు. ఉదయం ఎనిమిది గంటల 15 నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు విరామం లేకుండా నాట్యం చేసి గిన్నిస్ బుక్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో తన పేరు  నమోదు చేసుకోన్నాడు. కూచిపూడిలో 11 గంటల 15 నిమిషాలపాటు నృత్యం చేసిన రికార్డు జగిత్యాల జిల్లా కు చెందిన నరేష్ పేరు పై ఉంది. ఆ రికార్డును అధిగమించాలనే  పట్టుదలతో వేణుగోపాల్ బాల్కొండలో ఈ నృత్యం చేశారు. హైదరాబాద్ కు చెందిన వివిధ సంస్థల సమన్వయకర్తలు డి. లక్ష్మణ, ఆనంద్ సమక్షంలో తన పేరు నమోదు చేసుకున్నారు.వేణుగోపాల్ ఇప్పటికీ 50కి పైగా ప్రదర్శనలు చేశారు. ఆయన నిజామాబాద్ లోని సంగీత నృత్య కళాశాల కూచిపూడి అధ్యాపకుడు దేవులపల్లి ప్రశాంత్ వద్ద నాట్యం నేర్చుకున్నారు. ఆయన ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగానని చెబుతున్నారు. మరింత పరిణితి పొందడానికి తిరుపతిలోని నాట్య కళాశాలలో చేరి శిక్షణ పొందారు. గుంటూరు జిల్లా తెనాలిలో మరో మూడేళ్లు శిక్షణ తీసుకుని కూచిపూడిలో పట్టు సాధించారు. మహారాష్ట్రలోని పూణే ముంబై ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వరంగల్ పశ్చిమ బెంగాల్ లోని తదితర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు 50కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు మురళి గోపాల్ భీంగల్ లో పురోహితం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

Related Posts