YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

రోడ్డు భద్రత క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి

రోడ్డు భద్రత క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి

రోడ్డు భద్రత క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్ జనవరి 2

రోడ్డు భద్రత పై రూపొందించిన క్యాలెండర్, రవాణా శాఖ డైరీ లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఖైరతాబాదు రవాణా కార్యాలయంలో శాఖ అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పై రూపొందించిన నూతన సంవత్సరం-2020 క్యాలెండర్, జనవరి-2020 సంచిక మరియు డైరీ ని  మంత్రి ఆవిష్కరించారు. మంత్రికి  సంస్థ అధికారులు, ఉద్యోగులు నోట్ పుస్తకాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి అధికారులకు, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా శాఖ, ఆర్టీసీ  తనకు రెండు కళ్ళు లాంటివని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ  మేనేజింగ్ డైరెక్టర్  సునీల్ శర్మ,  ట్రాన్స్పోర్ట్ కమిషనర్  సందీప్ సుల్తానియా తదితరులు ఉన్నారు.

Related Posts