YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

 నెల రోజుల్లో వంద మంది చిన్నారుల మరణాలు జైపూర్,

 నెల రోజుల్లో వంద మంది చిన్నారుల మరణాలు జైపూర్,

 నెల రోజుల్లో వంద మంది చిన్నారుల మరణాలు
జైపూర్, జనవరి 2, 
రాజస్థాన్‌లోని ఒకే హాస్పిటల్‌లో నెల రోజుల వ్యవధిలో వంద మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. కోట పట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జేకే లోన్ హాస్పిటల్‌లో 2019 డిసెంబర్లో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. ఇదే హాస్పిటల్‌లో 2018 డిసెంబర్లో 77 మంది పసికందులు చనిపోవడం గమనార్హం. గతేడాది చివరి రెండు రోజుల్లోనే ఈ ఆసుపత్రిలో 9 మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. దీంతో హాస్పిటల్‌లో చనిపోయిన శిశువుల సంఖ్య 100కు చేరిందని సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్ దులారా తెలిపారు. బుధవారం రాత్రి కూడా ఇద్దరు నవజాత శిశువులు చనిపోయారని తెలుస్తోంది. దీంతో ఆ హాస్పిటల్‌లో చనిపోయిన శిశువుల సంఖ్య 102కి చేరింది.డిసెంబర్ నెల చివరి రెండు రోజుల్లో 9 మంది శిశువులు చనిపోవడానికి ప్రధాన కారణమని బరువు తక్కువగా పుట్టడం, నెలలు నిండకుండడా పుట్టడమేనని దులారా తెలిపారు. ఒకే హాస్పిటల్‌లో ఇంత మంది చిన్నారులు చనిపోవడంతో.. ఆ హాస్పిటల్‌లోని వైద్య పరికరాలు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేసి నివేదిక పంపాలని మెడికల్ కాలేజీలను రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది.ఈ హాస్పిటల్‌లో.. 2014లో 1198 మంది నవజాత శిశువులు చనిపోగా.. 2018లో 1005 మంది, 2019లో 963 మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. ఏటేటా తమ హాస్పిటల్‌లో శిశు మరణాల సంఖ్య తగ్గుతోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.నెల రోజుల వ్యవధిలో ఒకే హాస్పిటల్‌లో వంద మంది చిన్నారులు చనిపోవడానికి.. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తున్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బృందం కూడా హాస్పిటల్‌ను సందర్శించింది. కిటికీలు, గేట్లు పగిలిపోయి ఉండటం, హాస్పిటల్ ప్రాంగణంలో పందులు తిరగాడుతుండటం, సిబ్బంది కొరత తదితర సమస్యలను ఈ బృందం గుర్తించింది. హాస్పిటల్‌లో ఇంక్యుబేషన్ యూనిట్లు సరిగా పని చేయడం లేదని తెలుస్తోంది. సరిపడా ఇంక్యుబేటర్లు లేకపోవడంతో.. ఒకే దాంట్లో ఇద్దరు చిన్నారులను ఉంచుతున్నారు.మధ్యప్రదేశ్ సహా పొరుగున ఉన్న జిల్లాల నుంచి విషమ పరిస్థితిలో ఉన్న శిశువులను ఈ హాస్పిటల్‌కు రిఫర్ చేస్తుంటారు. ఈ హాస్పిటల్‌లో చనిపోయిన చిన్నారుల్లో ఎక్కువ మంది ఇలా అత్యవసర చికిత్స కోసం చేర్పించిన వారే’నని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఆరోగ్య మంత్రి రఘు శర్మ గత వారం తెలిపారు. చిన్నారులకు హాస్పిటల్ వర్గాలు సరైన చికిత్స అందిస్తున్నాయని రాజస్థాన్ ప్రభుత్వ కమిటీ స్పష్టం చేసింది.శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకాల ప్రకారం.. రాజస్థాన్‌లో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 38గా ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది అధికం.

Related Posts