YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన జేసీ

పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన జేసీ

పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన జేసీ
అనంతపురం, జనవరి 4, 
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో తన ముందస్తు బెయిల్ పత్రాలను సమర్పించారు. అనంతరం పీఎస్‌లో బెయిల్ పత్రాలు చూయించి.. సంతకం చేసి తిరిగి వచ్చేశారు. జేసీ గత నెలలో పోలీసులుపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదయ్యింది. ఈ కేసులోనే ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం పర్యటనకు వచ్చిన సందర్భంలో జేసీ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. పోలీసుతో బూట్లు నాకిస్తామని.. గంజాయి కేసులు పెడతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే దివాకర్‌రెడ్డి తీరుపై పోలీస్ అధికారుల సంఘం మండిపడింది. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో జేసీపై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.తనపై కేసు నమోదు కావడంతో జేసీ దివాకర్‌రెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సొంత పూచీకత్తుతో పాటు నెలకు రెండు సార్లు పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని షరతు విధించింది. కోర్టు ఆదేశాలతో జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు.. బెయిల్ డాక్యుమెంట్లు స్టేషన్‌లో సమర్పించారు.

Related Posts